Begin typing your search above and press return to search.
థ్రిల్లింగ్ మ్యాచ్: పాకిస్తాన్ ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా
By: Tupaki Desk | 12 Nov 2021 4:45 AM GMTప్రపంచకప్ టీ20 రెండో సెమీస్ లో అద్భుతం జరిగింది. గెలుస్తుందనుకు న్న పాకిస్తాన్ ఓడిపోయింది. ఓటమి అంచుల్లోంచి ఆస్ట్రేలియా అద్భుత విజయం సాదించింది. వరల్డ్ కప్ లో రెండో సెమీస్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాథ్యూవేడ్ 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో విరుచుకుపడి 41 పరుగులు చేశాడు. అతడికి స్టాయినిస్ 31 బంతుల్లో 40 నాటౌట్ వీరిద్దరి వీరోచిత ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. చివరి 4 ఓవర్లలో 50 పరుగులకు పైగా చేయాల్సిన దశలో గేర్ మార్చేసిన మాథ్యూవేడ్ భీకర పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో వరుసగా 3 సిక్సులు కొట్టి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను గెలిపించి ఫైనల్ కు చేర్చాడు. మాథ్యూవేడ్ అందించిన సులభమైన క్యాచ్ ను నేలపాలు చేసిన హసన్ అలీ పాకిస్తాన్ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్.
చివర్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ స్టాయినిస్, వేడ్ సిక్సులతో చెలరేగగా.. పాకిస్తాన్ నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఛేదించింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్టాయినిస్ 40, వార్నర్ 49 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ పడగొట్టారు.