Begin typing your search above and press return to search.
కారులో కుమ్ములాట..?
By: Tupaki Desk | 17 July 2019 5:30 PM GMTకారు గుర్తుపై పోటీచేసి ఓడిపోయిన నేత ఒకరు..కానీ కారు అధికారంలోకి రావడంతో ఎలాగైనా అధికారం తనదే అనుకున్నారు. ఇక కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కూడా కారెక్కడంతో ఇక్కడే పితలాటకం మొదలైంది. వలస వచ్చిన ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరి అంతా తానై వ్యవహరిస్తున్నారు. కారులో సీనియర్ నే పక్కనపెట్టేశాడు. ఈ ఆసక్తికర పరిణామం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కందాల వర్సెస్ తుమ్మల ఎపిసోడ్ సెగలు కక్కుతోందట. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. ఓడిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వమని కేసీఆర్ చెప్పడంతో తుమ్మలకు ఆ పదవి దక్కకుండా పోయింది. పోయిన సారి మంత్రి అయిన తుమ్మల ఎలాగూ ఏదైనా నామినేటెడ్ వస్తుందని ఎదురుచూశాడు.
అయితే ఇప్పుడు తుమ్మల నియోజకవర్గం పాలేరులో ఆయనను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పూర్తిగా పక్కనపెట్టేశారట.. మొన్నటి పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తుమ్మల వర్గానికి టీఆర్ ఎస్ టికెట్లే ఇవ్వలేదట.. దీనిపై తుమ్మల అధిష్టానానికి ఫిర్యాదు చేయగా ఇద్దరికీ సంధి కుదిర్చారట.. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు.
అయితే కందుల ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదులోనూ తుమ్మల వర్గాన్ని పక్కనపెట్టడంతో వివాదం ముదిరింది. పార్టీలో తుమ్మల వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వారంతా సమావేశమయ్యారట.. దీంతో తుమ్మల తన రాజకీయ భవిష్యత్ కోసం ఏలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.