Begin typing your search above and press return to search.

దలైలామాపై చైనా సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   7 March 2016 10:46 AM GMT
దలైలామాపై చైనా సంచలన ఆరోపణలు
X
బౌద్దులు, ప్రత్యేకించి టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్య దైవం దలైలామాపై చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. టిబెట్ పై చైనా పెత్తనానికి నిరసనగా గత వారం ఇద్దరు యువకులు ఆత్మాహుతికి పాల్పడడానికి దలైలామాయే కారణమని ఆరోపించింది. ఆయన, ఆయన అనుచరులు కారణంగానే వారిద్దరూ ఆత్మాహుతికిపాల్పడ్డారని ఆరోపించింది. చైనా అధికారిక మీడియాలో దీనిపై దలైలామాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

ఇద్దరి ఆత్మాహుతి తరువాత సుమారు 100 ఆత్మాహుతి యత్నాలు జరిగాయనీ, వీటికి పాల్పడిన వారిలో అత్యధికులు యువ బౌద్ధ సన్యాసులేనని చైనా మీడియా వివరించింది. ఈ ఆత్మాహుతుల వెనుక సూత్రధారులు టిబెటియన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా, అతని అనుచరులేనని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ రోజు పేర్కొంది. గత వారం డెహ్రడూన్ లో 16 ఏళ్ల టిబెట్ విద్యార్థి దోర్జీ త్సీరింగ్ తనను తాను కాల్చుకుని ఆత్మహుతికి పాల్పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో సియాచిన్ ప్రావిన్స్ లో 18 యేళ్ల బౌద్ధ బిక్షువు కల్సాంగ్ వాంగ్డు ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలనూ టిబెటన్ వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అవి పాశ్చ్యాత్త దేశాల మీడియా దృష్టికి చేరాయన్నారు. ఆత్మాహుతులన్నది టిబెటియన్ వేర్పాటు వాదుల ఎజెండాగా కనిపిస్తున్నదని చైనా అధికారిక, అనుకూల మీడియా పేర్కొంటోంది.