Begin typing your search above and press return to search.

చైనా అధ్యక్షుడికి టిబెటన్ల సెగ

By:  Tupaki Desk   |   12 Oct 2019 6:02 AM GMT
చైనా అధ్యక్షుడికి టిబెటన్ల సెగ
X
తమ దేశం మీద చైనా ఆదిపత్యాన్ని నిరసిస్తూ ఎన్నో దశాబ్ధాలుగా టిబెటన్లు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టిబెటన్లు ఏదైనా నిరసనలకు దిగుతారనే అనుమానాలు పోలీసులను వెంటాడాయి.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బస చేసిన ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ చుట్టు భద్రతా వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే చైనీయులు, టిబెటన్లు ఒకే పోలికతో ఉండడంతో ఎవరు నిరసనకారులో పోలీసులకు గుర్తించడం కష్టంగా మారింది.

అయితే చైనా అధ్యక్షుడు బస చేసిన ఐటీసీ హోటల్ లోకి ఆరుగురు టిబెటన్లు చొరబడడం ఉత్కంఠకు దారితీసింది. టిబెట్ జెండాలు చూపిస్తూ నినాదాలు చేశారు. గ్రూపులుగా విడిపోయి యువతీ యువకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. చైనా అధ్యక్షుడికి వ్యతిరేకంగా టిబెటన్లు చెన్నైలో మోహరించారని నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు చెన్నై శివారులో తనిఖీలు నిర్వహించారు. తాంబరంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఓ కళాశాల ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు. టిబెటన్లు మోహరించిన చోట పోలీసులు నిఘావలయంలోకి తీసుకొచ్చారు.

ఇక ఆరుగురు టిబెటన్లు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ వర్సిటీలో చదవుకుంటున్న విద్యార్థులు నిరసనకు వ్యూహం పన్నారని పోలీసులు పసిగట్టారు. బెంగళూరు నుంచి కూడా కొందరు రావడంతో రైల్వే స్టేషన్లు - బస్ స్టేషన్లు - విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేసి వారిని అరెస్ట్ చేశారు.