Begin typing your search above and press return to search.
బాలయ్య చిన్నల్లుడికి టికెట్ డౌటేనా?
By: Tupaki Desk | 21 Sep 2022 2:30 AM GMTహిందూపురం ఎమ్మెల్యే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయానా వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ.. చిన్నల్లుడు.. గురించి దాదాపు అందరికీ తెలిసిందే. విశాఖపట్నంలోని గీతం విద్యాసంస్థల అధినేత దివంగత మూర్తిగా మనవడు. ప్రస్తుత గీతం విద్యాసంస్థల చైర్మన్.. శ్రీభరత్. గత 2019 ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం పార్లమెంటుస్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. జగన్ సునామీ కారణంగా ఆయన పరాజయం పాలయ్యారు.
అయితే.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి శ్రీభరత్‌కు టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన విద్యాసంస్థలకు చైర్మన్‌గా విధులు నిర్వహిస్తూనే... మరోవైపు పార్టీ తరఫున కూడా వాయిస్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విశాఖ ఎంపీ సీటును లేదా.. భీమిలి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వ్యక్తిగతంగా భరత్ విషయానికివస్తే.. ఆయన ఉన్నత విద్యావంతుడు. అంతేకాకుండా.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవాడు. భరత్ తాత MVVS మూర్తి రెండుసార్లు వైజాగ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంఎల్‌సీగా పనిచేస్తూ మరణించారు. గోల్డ్ స్పాట్ కంపెనీ సృష్టికర్తగా ఈయనకు పేరుంది.
భరత్ తల్లితండ్రులు కావూరి సాంబశివరావు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన మరో రాజకీయ నాయకుడు. ఆ విధంగా శ్రీ భరత్ చుట్టూ రాజకీయం బలంగా ఉంది. కానీ, చంద్రబాబు సమర్ధవంతుడిగా, అవకాశం ఇస్తే లోకేష్‌ను సులువుగా పక్కన పెట్టే అవకాశం ఉన్నందున ఆయనను టికెట్ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇంకొంచెం వివరంగా చెప్పుకొంటే.. లోకేష్ కన్నా కూడా శ్రీభరత్ బాగా మాట్లాడగలడు. అదేవిధంగా ప్రజాదరణ కూడా ఉంది.
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే.. లోకేష్ ఓ వెలుగు వెలగాలంటే.. ఇలాంటి నేతలను ఎదగకుండా చేయాలి!! ఇదే ఇప్పుడు చేస్తున్నారనేది స్థానిక నేతల మాట. ఈ క్రమంలో బీమిలి టికెట్‌ను కోరాడ రాజాబాబుకు కన్ఫర్మ్‌చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన ఈ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించారు. రేపు ఎన్నికల సమయానికి ఎలాంటి పొత్తులు లేకపోతే.. విశాఖ పార్లమెంటు టికెట్‌ను మాత్రం పల్లా శ్రీనివాసరావుకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే.. బాలయ్య మొదటి అల్లుడు కోసం.. రెండో అల్లుడికి టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదీ ఒకరకంగా వెన్నుపోటేనని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.