Begin typing your search above and press return to search.

టికెట్​ రాలేదని..మహిళా నేత సూసైడ్ అటెంప్ట్​! అంతా ఆ మాజీ ఎమ్మెల్యేనే చేశాడా?

By:  Tupaki Desk   |   20 Nov 2020 4:00 AM GMT
టికెట్​ రాలేదని..మహిళా నేత సూసైడ్ అటెంప్ట్​! అంతా ఆ మాజీ ఎమ్మెల్యేనే చేశాడా?
X
జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చేసింది. నామినేషన్​ వేసేందుకు, ప్రచారం చేసుకొనేందుకు కూడా పెద్దగా టైమ్​ లేదు. ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తాయిలే అని తీరిగ్గా కూర్చున్న నేతలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్​ షాక్​ ఇచ్చింది. చాలా మంది స్థానికనేతలు ఎన్నికల కోసం ఇంకా అన్నిరకాలుగా సన్నద్ధం కాలేదు. ఉన్నట్టుండి ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ అనుచరులను, కార్యకర్తలను ఎన్నికల కోసం సన్నద్దం చేసేందుకు సమాయత్తం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్​ తెచ్చుకోవడం ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ప్రధాన పార్టీలైన టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ నుంచి ప్రతి డివిజన్​కు టికెట్​ కోసం పోటీపడే వారు అధికసంఖ్యలో ఉన్నారు.

దీంతో ఎవరైతే అధిష్ఠానం దృష్టిలో పడతారో? ఎవరైతా లాబియింగ్​ చేసుకుంటారో వారికే టికెట్​ దక్కే అవకాశం ఉంటుంది. ఒక్కో డివిజన్​ నుంచి కార్పొరేటర్​గా పోటీచేసేందుకు ఒక్కో పార్టీ నుంచి ఐదు నుంచి ఆరుగురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో టికెట్​ దక్కేది ఒక్కరికే మిగిలిన వారు రిక్తహస్తాలే. అయితే హైదరాబాద్​లో రాజకీయంగా ఎదగాలంటే దానికి కార్పొరేటర్​ పదవే తొలిమెట్టు. దీంతో చాలా మంది నేతలు ఈ పదవి కోసం ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో తాజాగా నాచారానికి చెందిన ఓ బీజేపీ మహిళా నాయకురాలు తనకు పార్టీ టెకెట్​ దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాచారానికి చెందిన విజయలతారెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ ఆశించారు. తనకు దక్కాల్సిన టికెట్‌ ఇతరులకు కేటాయించారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే ఆమెను అనుచరులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనకు టికెట్ రాకుండా మోసం చేసారని విజయలతారెడ్డి ఆరోపించారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఆమె బీజేపీ నుంచి కార్పొరేటర్​గా పోటీచేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​.. బీజేపీ టికెట్ల కేటాయింపుపై కీలకవ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతాపార్టీకి చెందిన వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. టికెట్​ దక్కలేదన్న మనస్తాపంతో ఆందోళనలు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
!