Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఎక్కితే క్యాష్ అక్కర్లేదు
By: Tupaki Desk | 6 Jan 2022 9:30 AM GMTఆన్ లైన్ లో టికెట్ కొనే వేళలో డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని వాడటం.. లేదంటే ఏదైనా వాలెట్ ను ఉపయోగించటం తెలిసిందే. కానీ.. ఆర్టీసీ బస్సుఎక్కితే మాత్రం టికెట్ చెల్లింపులకు కచ్ఛితంగా క్యాష్ ను మాత్రమే వాడటం తెలిసిందే. పొరపాటునజేబులో డబ్బులు లేకపోతే.. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్న తర్వాతే బస్సు ఎక్కాలి. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కొనుగోలుకు గతానికి భిన్నంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న కసరత్తు పూర్తి అయితే.. బస్సులు ఎక్కే వారి జేబులో క్యాష్ లేకున్నా ఫర్లేదు.
అందుకు బదులుగా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే సరిపోతుంది. నగదురహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కొత్త తరహా పేమెంట్ విధానానికి తెర తీస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఇందుకోసం హైదరాబాద్ మహానగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో క్యాష్ కు బదులుగా.. ఎలాంటి కార్డు చెల్లింపుల్ని అయినా ఓకే చేయాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ ఆర్టీసీ ఉంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
కార్డులతో బస్సు టికెట్లను ఇవ్వటం ద్వారా చిల్లర కష్టాలు తీరతాయని.. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన నగదును.. మళ్లీ అప్పజెప్పే పని తగ్గుతుందన్న యోచనలో టీఎస్ ఆర్టీసీ ఉంది. టీఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జన్నార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టెక్నాలజీ పరంగా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు.
ఇందుకు సంబంధించి పలు కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో క్యాష్ తో పాటు.. కార్డుల్ని స్వైప్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడతలో 900 బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేసి.. అందులోని కష్టసుఖాల్ని గుర్తించి.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.