Begin typing your search above and press return to search.
టిడ్కో ఇళ్ళు జగన్ కలల లోగిళ్ళు
By: Tupaki Desk | 15 Jun 2023 3:42 PM ISTటిడ్కో ఇళ్ళను పేదల కలలను తీర్చే అందమైన లోగిళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ ఇళ్ళను వారికి అందించడం ద్వారా దర్జా దర్పాన్ని కలిగించాలనుకుంటున్నారు. ఆనాటి తెలుగుదేశం పభుత్వం టిడ్కో ఇళ్ళ విషయంలో చేసింది తక్కువ ఆర్భాటం ఎక్కువ అన్నట్లుగా రాజకీయమే చేసింది.
టిడ్కో ఇళ్ళను పేద, మధ్యతరగతి వర్గాలకు అందించాలని, వారికి శాశ్వత ఆస్తిగా వాటిని ఉంచాలన్న బృహత్ సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా అంకిత భావంతో పనిచేస్తోంది. టిడ్కో ఇళ్ళకు మొత్తం పెట్టాల్సిన ఖర్చు ఏకంగా 28 వేల కోట్ల రూపాయలు పైన అయితే గత టీడీపీ ప్రభుత్వం అందులో సగానికి కూడా పెట్టకుండా వదిలేసింది. పైగా మూడు వేల కోట్ల బిల్లుల బకాయిలను కూడా వైసీపీ నెత్తిన వేసింది.
ఇక రెండేళ్ల పాటు రాష్ట్రంలో కరోనా ఉన్నా ఆదాయాలు దారుణంగా పడిపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో టిడ్కో ఇళ్ళను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు అందించాలనుకుంది. అందులో భాగంగా కేవలం ఇల్లు కట్టి ఇవ్వడమే కాదు పూర్తి మౌలిక సదుపాయలను కూడా కల్పిస్తోంది. విద్యుతు - వాటర్ - సీవరేజ్ వంటి వాటిని కూడా కల్పించడం ద్వారా టిడ్కో ఇళ్ళకు సరికొత్త అర్ధాన్ని చెబుతోంది.
మరో వైపు మూడు వందల అడుగులు ఉన్న టిడ్కో ఇళ్ళను ఉచితంగా పేదలను ఇవ్వాలనుకోవడం జగన్ మంచి మనసుకు నిదర్శనం అంటున్నారు. ఇదే చంద్రబాబు పాలనలో అయితే మూడు వందల అడుగుల ఇళ్ళకు నెలకు మూడు వేల రూపాయలు వంతున ఇరవై ఏళ్ల పాటు రుణం లబ్దిదార్లు కట్టాలి. అంటే ఏడు లక్షల ఇరవి వేల రూపాయలు అన్న మాట.
దాన్ని ఉచితం చేయడమే జగన్ సర్కార్ కి ఉన్న చిత్తశుద్ధిగా చెబుతున్నారు. ఇక మిగతా 365 అడుగుల 430 అడుగుల ఫ్లాట్స్ ను సగం ధరకే ప్రజలకు అందిస్తున్నారు. ఇలా కనుక చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ళ మీద పెట్టిన ఖర్చు చూపిన శ్రద్ధ చాలానే ఉంది. 300 అడుగుల ఇంటిని జగన్ ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై భారం రూ. 5,340 కోట్లు. కానీ ప్రభుత్వం ప్రజలకోసం ఆ భారాన్ని భరిస్తోంది.
అలాగే 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఫ్లాట్ల అడ్వాన్స్ చెల్లింపుల్లో 50 శాతం రాయితీ కూడా ప్రభుత్వం భరించింది. దీనిపై ప్రభుత్వంపై అదనపు భారం మరో రూ.482.31 కోట్లు.
ఉచిత రిజిస్ట్రేషన్ రూపంలో రూ.1200 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
అదే విధంగా చూసుకుంటే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లపై ఇప్పటివరకూ రూ.8734 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్ల కరోనా సంక్షోభం ఉన్నా కూడా ఇప్పటికే 62 వేలకు పైగా ఇళ్లు పూర్తి చేశారు. టిడ్కో ఇళ్లు మురికి కూపాలుగా మారిపోకుండా మౌలిక సదుపాయాలు కోసం దాదాపు మూడు వేలకోట్లు ఖర్చుపెట్టింది.
ఇక లెక్క తీస్తే మూడు వందల అడుగులు ఉన్న ప్లాట్ కి ఉచితం అంటే ఆ విధంగా లాభం పొందే వారి సంఖ్య అక్షరాలా లక్షా 43 వేల 600 మంది ఉంటారు. ఒక్క రూపాయికే 300 అడుగుల ఫ్లాట్స్ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చుని భరిస్తుంది.
అదే విధంగా 365 - 430 అడుగులతో కలిపి మొత్తం ఫ్లాట్స్ 2.62 లక్షల దాక ఉన్నాయి. వీటికి సబ్సిడీల రూపంలో రూ. 14,514 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇలా కనుక చూసుకుంటే టిడ్కో ఇళ్ల కోసం జగన్ ప్రభుత్వం మొత్తం పెట్టిన ఖర్చు రూ. 18,714 కోట్ల రూపాయౌగా ఉంది.
ఇక టిడ్కో ఇళ్ళు ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించినవి 61,948 కాగా, ఈ ఏడాది చివరకు అందించే ఫ్లాట్స్ రెండు లక్షల 62 వెల 216గా టార్గెట్ పెట్టుకున్నారు. ఇలా ఒక ఉన్నత ఆశయంతో టిడ్కో ఇళ్ళ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూంటే మొత్తం ప్రాజెక్టు నిధుల్లో కనీసం పదిపైసల వంతు కూడా ఖర్చు చేయకుండానే అంతా తామే చేసాం అంటూ అక్కడ సెల్ఫీలు దిగి ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబును చూసి ఏమనాలి అన్నదే ప్రశ్నగా ఉంది మరి.
ఈ విషయాన్ని టిడిపి కార్యకర్తలు కూడా అర్ధంచేసుకుని వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. టిడ్కో ఇళ్ళు అని ప్రచారం చేసుకుంటూ ఏమీ కట్టకుండానే క్రెడిట్ కొట్టేద్దామని చూస్తున్న చంద్రబాబుకు సైలెంట్ గా జగన్ ప్రభుత్వం ఇస్తున్న షాక్ టోటల్ గా అందమైన టిడ్కో ఇళ్ల నిర్మాణం. ఈ టిడ్కో ఇళ్లను పొందిన లబ్దిదారులే వాస్తవాలు ఏంటో చెబుతారు. ప్రచారం కోసం అవాస్తవాలు టీడీపీ నేతలు చెబుతున్నా అసలు నిజాలు లెక్కలతో సహా ఉన్నాయి. ఆ రికార్డులు అన్నీ కూడా జనం ముందే ఉన్నాయి.
ఏళ్ళకు ఏళ్ళు చెక్కు చెదరకుండా పేద, మధ్య తరగతి వర్గాలకు జగనన్న ఇచ్చే కానుక టిడ్కో ఇళ్ళు అని అంటున్నారు. వారికి సామాజికంగా ఒక హోదా గౌరవంతో పాటు శాశ్వత ఆస్తిని కూడా అందచేయాలన్న జగనన్న సంకల్పమే టిడ్కో ఇళ్ళకు సదా శ్రీరామ రక్ష అంటున్నారు.