Begin typing your search above and press return to search.
కో పైలెట్ మాట వినకుండా..విమానాన్ని బురదలో దించాడు
By: Tupaki Desk | 11 May 2019 12:57 PM GMTఏడాదిన్నర క్రితం అబుదాబి నుంచి 102 మంది ప్రయాణికులతో కేరళలోని కొచ్చి వచ్చిన ఎయిరిండియా విమానం విమానాశ్రయంలోని రన్ వేపై నుంచి పక్కకు వెళ్లి బురదగుంటలో దిగబడటం...ఈ ఘటనలో పలువురు గాయపడటం అనే సంఘటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రన్ వేపై నుంచి విమానం ఇలా ప్రమాదం బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఇలా జరిగిందేమోనని అంచనా వేశారు. అయితే, ఈ ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ నాటి ప్రమాదానికి భారీ వర్షాలు కారణం కాదని తేల్చింది. పైలట్.. కోపైలట్ గా ఉన్న మహిళ మాటల్ని పెడచెవిన పెట్టడంతో చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందాన ఈ ప్రమాదానికి గురైందని తేల్చింది.
ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న తర్వాత రన్ వే కనిపించనందున విమానం వేగం తగ్గించాలని - రన్ వేను చూపే ఫాలో అవ్వాలని - కోపైలట్ గా ఉన్న మహిళ.. తన కన్నా 30 సంవత్సరాలు పెద్ద వాడైన పైలట్ కు సూచించింది. ఆమె మాటల్ని పట్టించుకోని పురుష పైలట్.. భారీ వర్షంలో విమానాన్ని దించడంతో రన్ వే నుంచి జారీ బురదగుంటలోకి వెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా - విమానం ముందు భాగం దెబ్బతింది. కాగా, ఈ ఘటనను తీవ్రంగా తీసుకొన్న పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ).. ప్రమాదంపై విచారణకు ఒక కమిటీ వేసింది. ఈ మేరకు కమిటీ సంచలన వివరాలను వెల్లడిస్తూ. కోపైలెట్ అయిన మహిళ వివరాలు విననందుకే ఇలా జరిగిందని తేల్చింది.
తాజా ప్రమాదంతో పాటుగా మరిన్ని సూచనలతో కూడిన అంశాలను సైతం ఈ కమిటీ ప్రతిపాదించింది. పైలట్ - కోపైలట్ మధ్య 13వేల గంటల ఫ్లైట్ డ్రైవింగ్ అవర్స్ వ్యత్యాసం ఉందని కమిటీ సభ్యులు గుర్తించారు. విమాన సిబ్బంది మధ్య సమన్వయం పెంచేందుకు కృషిచేయాలని ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాద పరిశోధన బ్యూరో (ఏఏఐబీ) ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సూచించింది. ఇలాంటి ప్రమాదాలు ఇకముందు జరుగకుండా ఉండాలంటే పైలట్ - కోపైలట్ ల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండకుండా చూడాలని అధికారులు తమ నివేదికలో సూచించింది. ఈ విమానం పైలట్ గా ఉన్న వ్యక్తి గతంలో మద్యం సేవించి రెండుసార్లు దొరికిపోవడంతో మూడునెలలపాటు లైసెన్స్ ను సస్పెండ్ చేశారని నివేదికలో అధికారులు వెల్లడించారు.