Begin typing your search above and press return to search.

పులి ఆ కాలేజికి ఎందుకు వెళ్లింది

By:  Tupaki Desk   |   30 Oct 2015 6:31 AM GMT
పులి ఆ కాలేజికి ఎందుకు వెళ్లింది
X
పెద్దపులి అంటే దట్టమైన అరణ్యాల్లో ఉంటుందనే అంతా అనుకుంటాం... అడవులు పక్కనుండే ఊళ్లోకి ఎప్పుడైనా వస్తే రావొచ్చు.. కానీ.. ఏకంగా ఒక రాష్ట్ర రాజధానిలోని కాలేజిలోకే ఎంటరైపోయింది. ఇంకేముంది... కాలేజి విద్యార్తులంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. అయితే... అంతభయంలోనూ వారు పులిని ఫొటోలు తీసి తమ పిచ్చి చాటుకున్నారు.

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోపాల్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కాలేజిలోకి ఇటీవల ఓ పులి ప్రవేశించింది. దీంతో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకోవడానికి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొందరు మాత్రం భవనాలపైకి ఎక్కి పులిని ఫొటోలు తీశారు. అటవీ శాఖ అధికారులు వచ్చి దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు.

విద్యార్థులు ఈ సీనంతా తమ కెమేరాల్లో బంధించడంతో సహజంగానే అది సోషల్ మీడియాకు చేరిపోయింది. అయితే... ఈ పులి తమ కాలేజికి ఎందుకొచ్చిందన్న విషయమై భోపాల్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కాలేజి కుర్రకారు జోకులేస్తున్నారు. కాలేజిలో పాఠాలు చెప్పకపోతే మీ పని పడతానని మేనేజిమెంటును హెచ్చరించడానికే వచ్చిందని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం తమ కాలేజిలో అమ్మాయిలు బాగుంటారు కాబట్టి సైటేయడానికి వచ్చిందని ఇంకొందరు జోకులు కట్ చేస్తున్నారు.