Begin typing your search above and press return to search.

మెమ‌న్ ఉరి వ‌ద్ద‌న్నోళ్లు ఇది విన్నారా?

By:  Tupaki Desk   |   7 Aug 2015 9:25 AM GMT
మెమ‌న్ ఉరి వ‌ద్ద‌న్నోళ్లు ఇది విన్నారా?
X
రెండు ద‌శాబ్దాలకు పైనే ముంబ‌యి పేలుళ్ల‌లో వంద‌లాది మంది మ‌ర‌ణించ‌టం.. దానికి కార‌ణ‌మైన వారిలో యాకూబ్ మెమ‌న్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం.. సుదీర్ఘ‌కాలం పాటు సాగిన న్యాయ‌విచార‌ణ అనంత‌రం.. వివిధ స్థాయిలో అత‌న్ని దోషిగా నిర్ధారించి.. అత‌నికి ఉరిశిక్ష వేయ‌టం తెలిసిందే.
ఉరిశిక్ష అమ‌లు చేయ‌టానికి రెండు గంటల ముందు వ‌ర‌కు త‌మ ప్ర‌య‌త్నాల్ని కొన‌సాగించి.. చివ‌ర‌కు తెల్ల‌వారుజామున కోర్టు ఇచ్చిన తీర్పు అనంత‌రం.. అత‌న్ని ఉరి తీయ‌టం తెలిసిందే.

యాకూబ్ మెమ‌న్ ఉరిని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు.. బాలీవుడ్ సెలబ్రిటీలు.. మేధావుల‌మ‌ని చెప్పుకునే పెద్ద‌మ‌నుషులు.. మాన‌వ‌తావాదుల‌మ‌ని త‌మ‌ను తాము అనుకుంటూ నీతులు చెప్పే వారు.. వ్య‌తిరేకించటం తెలిసిందే. ఇక‌.. యాకూబ్ మెమ‌న్ భార్య‌.. కుటుంబ స‌భ్యులు అయితే.. అత‌గాడు చాలా అమాయ‌కుడ‌ని.. నోట్లో వేలు పెడితే కొర‌క‌లేడ‌ని.. అన్యాయంగా ఉరి తీస్తున్నారంటూ వ్యాఖ్య‌లు చేశారు. దీన్ని న‌మ్మిన‌వారూ ఉన్నారు.
అయితే.. ముంబ‌యి బాంబు పేలుళ్ల వ్య‌వ‌హారంలో మెమ‌న్ ఫ్యామిలీ.. ఫ్యామిలీ మొత్తానికి పాత్ర ఉంద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. త‌న త‌మ్ముడ్ని ఉరి తీయ‌టంపై అన్న టైగ‌ర్ మెమ‌న్.. యాకూబ్ ఉరికి స‌రిగ్గా గంట‌న్న‌ర ముందు ఫోన్ మాట్లాడిన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌పై అత‌ని కుటుంబంపై క‌న్నేసిన నిఘా వ‌ర్గాలు.. తాజాగా ఈ స‌మాచారాన్ని బ‌య‌ట పెట్టాయి.

త‌న త‌ల్లితో మాట్లాడిన యాకూబ్‌మెమ‌న్‌.. ల్యాండ్ లైన్ ఫోన్‌కి మాట్లాడుతూ.. త‌న త‌మ్ముడి ఉరికి సంబంధించి.. క‌చ్ఛితంగా ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని చెప్పాడ‌ట‌. ఆ త‌ర్వాత మ‌రోవ్య‌క్తితో కూడా టైగ‌ర్ మెమ‌న్ మాట్లాడిన‌ట్లు గుర్తించారు.

మ‌రి.. తాజా వ్య‌వ‌హారంపై యాకూబ్ మెమ‌న్ ఉరిని వ్య‌తిరేకించిన వారు ఏం చెబుతారు? ఇలాంటి ఉగ్ర‌వాద కుటుంబాన్ని దేశం భ‌రించాల్సిన అవ‌స‌రం ఉందా? మేధావులు.. రాజ‌కీయ నేత‌ల‌కు ప్ర‌జ‌ల ప్రాణాల కంటే కూడా.. ఉగ్ర‌వాదులు.. వారితో స‌న్నిహిత సంబంధాలు ఉన్న వారి ప్రాణాలే ముఖ్య‌మా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. యాకూబ్ మెమ‌న్ ఉరిని త‌ప్పించ‌టం కోసం చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ప్ర‌య‌త్నించిన లాయ‌ర్ ను.. తాజా ఉదంతంపై స్పందించాల‌ని కోరితే.. త‌న‌ను ఇందులోకి లాగొద్ద‌ని అస‌హ‌నంగా బ‌దులిచ్చాడట‌. దోషుల‌కు.. దుర్మార్గుల‌కు.. దేశాన్ని అభ‌ద్ర‌త‌కు గురి చేసే వారి క్షేమం కోసం ప్ర‌య‌త్నించే వ్య‌క్తులు ఇంకేం చేయ‌గ‌ల‌రు..?