Begin typing your search above and press return to search.

పార్కులో మహిళ.. షాకింగ్ వీడియో!

By:  Tupaki Desk   |   25 July 2016 4:21 AM GMT
పార్కులో మహిళ.. షాకింగ్ వీడియో!
X
వీకెండ్ సమయాల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని చైనా రాజధాని బీజింగ్ నగరంలోని బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్కుకు వెళ్లింది ఒక మహిళ! కాసేపటితర్వాత ఆ మహిళకు జరిగిన విషయం సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారంతా షాక్ తింటున్నారంటే అతిశయోక్తి కాదేమో! కారణం.. అనూహ్యంగా ఆ మహిళ పులికి ఆహారమవడమే!

సాదారణంగా ఈ బడాలింగ్ వైల్డ్ లైఫ్ పార్కులో సందర్శకులు తమ తమ సొంత కార్లలో సఫారీకి వెళ్లే వీలుంటుంది. అదేక్రమంలో తమ కుటుంబ సభ్యులతో కారులో బయలుదేరింది ఒక యువతి. అనంతరం కారులో తన కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకుని, అలిగి కారు దిగింది. ఇదే అదను అనుకున్న ఒక పులి కన్నుమూసి తెరిచేలోగా బలమైన పంజాతో యువతిని లాక్కుపోయింది. షాక్ నుంచి తేరుకున్న కారులో ఉన్న వ్యక్తి - మరో మహిళ పులిని వెంబడించి ఆమెను రక్షించే ప్రయత్నం చేసేసమయంలో సీన్ లోకి మరో పులి ఎంటరైంది.. అదే ఫోర్స్ తో సాయం చేసేందుకు వచ్చిన రెండో మహిళపై దాడిచేసి చంపేసింది.

ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అవడంతో ఈ విషయం సంచలమైంది. కాగా.. మొదట దాడికి గురైన యువతి గాయలతో బయటపడగా పురుషుడికి పెద్దగా గాయాలుకాలేదు. ఇదేసమయంలో కారులో ఉన్న మరో చిన్నారి కూడా సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఈ పార్కును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.