Begin typing your search above and press return to search.
టీడీపీ మాజీ మంత్రికి బిగిస్తున్న కేసుల ఉచ్చు.. జైలు తప్పదా?!
By: Tupaki Desk | 19 Oct 2021 8:59 AM GMTఏపీ టీడీపీకి చెందిన మాజీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి అరంగేట్రం చేసిన భూమా అఖిల ప్రియ, ఆమె భర్త.. సహా సోదరుడికి.. జైలు తప్పేలా లేదా? అంటే.. తాజా పరిస్థితులను అంచనా వేస్తున్నవారు.. ఔననే అంటున్నారు. భూ వివాదానికి సంబంధించి దాదాపు ఏడాది కిందట.. జరిగిన కిడ్నాప్ కేసులో తాజాగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. దీనిలో ప్రధాన నిందితుడిగా.. అఖిల ప్రియ భర్త, అఖిలను కూడా చేర్చడం గమనార్హం. అదేసమయంలో ఆమె సోదరుడు కూడా ఈ కేసులో ఉన్నట్టు అధికారులు చార్జిషీట్‌లో నమోదు చేశారు.
హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తయింది. కిడ్నాప్ కేసులో పోలీసులు 75 పేజీల ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు. ప్రవీణ్‌రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ అధికారుల పేరుతో వారి ఇంట్లోకి వెళ్లి కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. అఖిలప్రియ దంపతులతో పాటు 30 మందిపై కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఏం జరిగింది?
బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో ఉంటున్న ప్రవీణ్, నవీన్, సునీల్‌లను బెదిరించి భూమి హక్కులను రాయించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ పథకం రచించారు. వారి అనుచరులకు ఆదాయపు పన్నుశాఖ, పోలీసు అధికారులుగా వేషాలు వేయించారు. సుమారు 15 మంది నకిలీ గుర్తింపు కార్డులు ధరించి మూడు కార్లలో ప్రవీణ్‌రావు నివాసానికి వెళ్లారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చి వారెంట్లు చూపించారు. సోదాల మిషతో మహిళలు, పిల్లలను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అనంతరం ప్రవీణ్‌రావు సహా ముగ్గురినీ బెదిరించి కార్లలో తీసుకెళ్లారు.
గంటసేపైనా అలికిడి లేకపోవడంతో ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు పక్క ఫ్లాట్‌లో వారికి ఫోన్ చేయగా.. ఓ మహిళ వచ్చి తాళం తీశారు. ప్రవీణ్, నవీన్, సునీల్ కనిపించకపోవడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. కిడ్నాప్ చేసి కార్లలో తీసుకెళ్తుండగా, రాణిగంజ్ వద్ద ప్రవీణ్ గట్టిగా కేకలు వేయడంతో ఓ ప్రయాణికుడు అనుమానించి డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో ఉత్తర మండలం పోలీసులు హైదరాబా ద్, సైబరాబాద్, రాచకొండ ప్రధాన కంట్రోల్ రూంలను అప్రమత్తం చేశారు.
ఈలోగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బోయిన్‌పల్లి పోలీసులకు ఫోన్ చేసి ప్రవీణ్‌రావు ఇంట్లో ఏదో జరుగుతోందని చెప్పారు. ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ వెళ్లి బాధితుల కుటుంబ సభ్యుల తో చర్చించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 15 బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాపర్లు రింగ్ రోడ్ మీదుగా బాధితులను మహారాష్ట్రకు తరలించాలనుకున్నారు. పోలీసుల తనిఖీలు ముమ్మరం కావడంతో రాత్రంతా ఔటర్ రింగ్ రోడ్‌పైనే సంచరించారు. చివరకు నార్సింగి-కోకాపేట మార్గంలో బాధితులను వదిలేయగా, పోలీసులు సురక్షితంగా ఇంటికి చేర్చారు.
బాధితులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. ఆమెను, ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్‌లను బోయిన్‌పల్లి పోలీస్ ఠాణాకు తరలించారు. అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అఖిల ప్రియ, ఆమె భర్త, తమ్ముడు.. టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి.. ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన చార్జ్ షీట్‌ను దాఖలు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. దీంతో వీరికి జైలు తప్పదనే అంచనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి