Begin typing your search above and press return to search.
హెచ్1బీ కొత్త రూల్స్ మనకు మేలే!!
By: Tupaki Desk | 13 April 2017 9:32 AM GMTహెచ్-1బీ వీసాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలతో ఇటు భారతదేశంలో, అటు అమెరికాలోని ఎన్నారైల్లో పెద్ద ఎత్తున్నే కలవరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు మొదలుకొని కంపెనీల వరకు ఆందోళనలో ఉండగా...ప్రముఖ ఐటీ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ టాప్ ఉద్యోగి అయిన మోహన్ దాస్ పాయ్ ఈ నిబంధలను మన మంచికేనని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు ఆఫ్ షోర్-ఆన్ సైట్ ఉద్యోగ నిష్పత్తి 70:30 ఉందని వీసా నిబంధనలతో ఆ నిష్పత్తి 90:10కి పెరగనుందని వెల్లడించారు. దీని వల్ల భారత ఐటీ సంస్థలు ఆఫ్‌షోర్ విభాగంలో మరింతగా పనిచేయడంతో పాటు పోటీతత్వాన్ని పెంచుకుంటాయని తెలిపారు. మొత్తం 90 శాతం కార్యకలాపాలు ఆఫ్‌షోర్‌లో నిర్వహించడం ద్వారా పోటీతత్వంతో పాటు వారి నైపుణ్యం పెరిగే అవకాశముందని పాయ్ చెప్పారు.
హెచ్-1 బీ వీసాలపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు భారత ఐటీ పరిశ్రమకు అనుకూలంగా పరిణమించడానికి గల కారణాలను సైతం మోహన్ దాస్ పాయ్ వివరించారు. హెచ్-1 బీ వీసాలపై అమెరికా విధిస్తున్న నిబంధనలు భారత ఐటీ కంపెనీలకు మరింత లాభాలను తీసుకురానున్నాయని ఆయన చెప్పారు. నాణ్యత కలిగిన సేవల కోసం ఉత్తమ కంపెనీలను ఆశ్రయించాల్సి ఉంటుందని, ఈ కోణంలో పరిశీలిస్తే భారత ఐటీ కంపెనీలు ఉత్తమ సేవలు అందించడంతో పాటు సేవా రుసుములను ఎక్కువగా పొందే అవకాశముందని ఆయన విశ్లేషించారు. `సగటున ఐటీ ఉద్యోగికి ఏడాదికి 80 వేల డాలర్లనుంచి 85 వేల డాలర్ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని కంపెనీలు సరైన నైపుణ్యం లేని వారిని ఐటీ నిపుణులుగా నియమిస్తుండటంతో భారత్‌కు చెడ్డపేరు వస్తోంది. ఇలాంటి చర్యలకు కూడా అడ్డుకట్ట వేసే అవకాశముంది`అని పాయ్ చెప్పారు. కాగా, నాణ్యమైన సేవలను అందించేందుకు అవసరమైన ఐటీ నిపుణులు అమెరికాలో లేరు కాబట్టి ఆ కంపెనీలు భారత్‌పైన ఆధారపడాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో భారత కంపెనీలకు గిరాకీ పెరగడంతో పాటు సేవారుసుములను ఎక్కువగా చెల్లించేందుకు అమెరికా ముందుకురావాల్సి ఉంటుందని మోహన్ దాస్ పాయ్ వివరించారు.
కాగా, వీసాలపై అమెరికా ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియకుండా ఉందని మోహన్‌దాస్ పాయ్ అన్నారు. హెచ్-1బీ వీసాలకు సంబంధించి రానున్న ఆరుమాసాల వరకు అనిశ్చితి కొనసాగుతుందని జోస్యం చెప్పారు. తనిఖీల పేరుతో అమెరికన్ అధికారులు చేస్తున్న చర్యలు కూడా వీసా దరఖాస్తులు తగ్గేందుకు దోహదం చేస్తాయన్నారు. మొత్తంగా ఐటీ సేవలకు సంబంధించి ఆఫ్‌షోర్ వాణిజ్యంలో భారత్ కీలకంగా మారుతుందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/