Begin typing your search above and press return to search.
అమెరికా వీసా ఇంకా కఠినం చేసేసిన ట్రంప్
By: Tupaki Desk | 1 Jun 2017 1:33 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకుల పరంపరలో మరో పరిణామం చోటుచేసుకుంది. వీసా దరఖాస్తుదారులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్‌ను జారీ చేశారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రతిపాదించిన ఈ విచారణ ప్రకారం...అభ్యర్థులందరూ అన్ని పాస్ పోర్టు నెంబర్లను, 5 ఏళ్ల విలువైన సోషల్ మీడియా ఖాతాలు - ఈ-మెయిల్ అడ్రస్ లు - ఫోన్ నెంబర్లు - అదేవిధంగా 15 ఏళ్ల బయోగ్రాఫికల్ సమాచారాన్ని అమెరికా వీసాకోసం దరఖాస్తు చేసే ముందు సమర్పించాల్సి ఉంటుందని తాజా ఆదేశాల్లో స్పష్టం చేశారు.
అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ వెలువరించిన ప్రకటన ప్రకారం తీవ్రవాదుల దాడులను నిరోధించేందుకు తగు చర్యలు తీసుకోవాలని భావించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని భావించి తాజా నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. ఈ క్రమంలో వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉందేమో తేల్చేందుకు సోషల్ మీడియా అకౌంట్ల విచారణ కూడా అందులో భాగమని వివరించింది. ఒకవేళ వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్టు తేల్చిచెప్పింది. అయితే ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకొని ఈ నిబంధనలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఈ విచారణలో సోషల్ మీడియా అకౌంట్ల యూజర్ నేమ్ - పాస్ వర్డ్ లను ఆఫీసర్లు అడగరని వెల్లడించింది.
ఈ అదనపు స్క్రీనింగ్ తో దరఖాస్తుదారుడి ఇంటర్వ్యూ సమయం గంటకు పైగా పట్టనుందని, 65వేల మందికోసం అదనంగా 65 వేల గంటలను వెచ్చించాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నూతన నిబంధనలతో కొత్త కొత్త ప్రశ్నలతో వీసా జారీ ప్రక్రియ చాలా జాప్యమౌతోందని అంతర్జాతీయ విద్యార్థులను శాస్త్రవేత్తలను ఇది నిరుత్సాహపరుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/