Begin typing your search above and press return to search.
కరోనా ప్రభావం: తీహార్ జైలు నుంచి ఖైదీలు విడుదల
By: Tupaki Desk | 29 March 2020 10:06 AM GMTకరడుగట్టిన నేరగాళ్లతో పాటు ప్రముఖులు తప్పిదాలు చేస్తే వారిని బంధించే ఖారాగారం తీహార్ జైలు. ఈ జైలు పేరు వింటే ఎంతోమంది గుర్తుకు వస్తారు. అలాంటి ఈ జైలు నుంచి ఇప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు. కరోనా కట్టడి నేపథ్యంలో ప్రజలంతా గుమిగూడి ఉండవద్దని ప్రభుత్వ అధికారులతో పాటు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో జైలులో కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలు ఒకచోట కలిసి ఉంటుంటారు. వారంతా గుమిగూడి ఉండొద్దనే సూచన మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలులోని ఖైదీలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేశారు. మొత్తం 356 మంది ఖైదీలను తాజాగా జైలు నుంచి వదిలారు. వీరిలో 63 మందిని ఎమర్జెన్సీ పెరోల్ పై విడుదల చేశారు.
కరోనా కట్టడికి జైలు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో ఖైదీలను విడుదల చేస్తున్నారు. దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయి. రోజురోజుకు కరోనా కేసులు తీవ్రమవుతుండడంతో ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. జైలులో కూడా కరోనా నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. మరుగుదొడ్లు - పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం.. చెత్తాచెదారం లేకుండా చూస్తున్నారు. శానిటైజర్ - సబ్బులు అందుబాటులో ఉంచుతున్నారు. పోలీసులు - జైలు అధికారుల సహకారంతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే పలు జైళ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు విడుదల చేశారు. వాటిలో భాగంగా తీహార్ జైలు నుంచి 356 మంది విడుదలయ్యారు. వారిని నిబంధనల ప్రకారం వదిలి వేశారు. కరోనా వైరస్ పుణ్యమా అని ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేయడంపై వారి కుటుంబసభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.