Begin typing your search above and press return to search.
మరో కుటుంబంలో విషాదాన్ని నింపిన టిక్ టాక్ ..ఏమైందంటే !
By: Tupaki Desk | 21 May 2020 12:30 AM GMTఈ మధ్య కాలంలో ఎక్కడ చుసిన టిక్ టాక్ ..టిక్ టాక్. వయస్సు తో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్సు వారు ఈ టిక్ టాక్ మోజులో పడిపోయారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయం కావడంతో ఎక్కువ మంది టిక్ టాక్ లోనే రోజంతా గడిపేస్తున్నారు. అయితే, ఈ టిక్ టాక్ వల్ల జరిగే ఎన్నో అనర్దాలను ఇప్పటికే మనం చూసాం. మన దేశంలో చాలా చోట్ల హత్యలు, ఆత్మహత్యలు కూడా ఈ టిక్ టాక్ వల్ల చోటుచేసుకుంటున్నాయి.
అలాగే టిక్ టాక్ తో లేచిపోయిన జంటలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ టిక్ టాక్ మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేవలం 24 గంటల వ్యవథిలో ఇద్దరి ప్రాణాలు తీసింది. పూర్తి వివరాలు చూస్తే .. విజయవాడలోని జక్కంపూడిలో ఈ ఘటన జరిగింది. తరచూ టిక్ టాక్ చేయొద్దని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. తల్లి మరణాన్ని కొడుకు జీర్ణించుకో లేకపోయాడు. తల్లి మరణించిన కొన్ని గంటలకే పురుగుల మందు తాగి తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విధంగా ఒక రోజు వ్యవథిలోనే తల్లికొడుకులు ఇద్దరు మరణించడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది మరోవైపు దేశంలో టిక్ టాక్ ను నిషేధించాలంటూ జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ప్రకటించారు. టిక్ టాక్ వల్ల గృహ హింస పెరిగిపోతోందని, మహిళలపై అత్యాచారాలు-దాడులు ఎక్కువైపోతున్నాయని ఆమె ఆరోపించారు.