Begin typing your search above and press return to search.
భారత్ లోకి టిక్ టాక్.. రీఎంట్రీకి అంత భారీగా కసరత్తు జరుగుతోందట
By: Tupaki Desk | 27 Jun 2021 7:30 AM GMTదాదాపు ఏడాదిన్నర క్రితం కోట్లాది మంది భారతీయులు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు టిక్ టాక్ లో మునిగి తేలేవారు. పెద్ద ఎత్తున వీడియోలు తీస్తూ షేర్ చేసే వారు కొందరైతే.. ఆసక్తికర వీడియోల్ని చూసుకుంటూ గంటల తరబడి సమయాన్ని గడిపేసేవారు. దేశ ప్రజల భద్రత కోసం 250 యాప్స్ ను కేంద్రం నిషేధించాయి. అందులో చైనాకు చెందిన యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. టిక్ టాక్ దాని అనుబంధ సంస్థకు చెందిన హలో యాప్ లకు భారీ దెబ్బ పడింది.
నిషేధం నాటికి 20 కోట్ల డౌన్ లోడ్లు ఉన్న టిక్ టాక్ లో పోస్టు చేసిన చిట్టి వీడియోలు తెగ సందడి చేసేవి. టిక్ టాక్ మీద బ్యాన్ తర్వాత ఇదే తరహాలో ఉండే యాప్ లు బోలెడన్ని వచ్చినా.. అవేవీ టిక్ టాక్ కు వచ్చిన ఆదరణను సొంతం చేసుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్.. భారత్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తెగ ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్రంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
టిక్ టాక్, హలో కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలని.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలకు అనుగుణంగా తాముపని చేస్తామన్న విన్నపాన్ని పదేపదే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యూజర్ల డేటా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో టిక్ టాక్ రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుందని.. త్వరలోనే కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.