Begin typing your search above and press return to search.
పోలీస్ స్టేషన్ లో టిక్ టాక్ స్టార్ ..అసలేమైంది
By: Tupaki Desk | 31 Oct 2019 7:08 AM GMTటిక్ టాక్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న సరికొత్త యాప్. ఈ యాప్ తో తమలోని ట్యాలెంట్ ని ఎంతో మంది బయటపెడుతున్నారు. కానీ, ఈ టిక్ టాక్ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ..అంతకంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియో చేయడం టిక్ టాక్ లో అప్ లోడ్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఈ టిక్ టాక్ ద్వారా స్టార్ గా మారిన సోనాలి ఫోగాట్ ఈ మద్యే హర్యానా ఎన్నికల్లో అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేసింది.
కానీ, ఆమె టిక్ టాక్ లో అయితే అభిమానులని ఆకట్టుకుంది కానీ , ఓటర్లని మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒకకంప్లయింట్ ఇచ్చింది. ఆ కంప్లయింట్ కూడా తన సొంత అక్క ,భావ ల మీదే ఇచ్చింది. తన అక్క, బావ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. మంగళవారం రాత్రి తన స్వస్థలం భూటాన్ కలాన్ కి వెళ్లినపుడు ఆమె అక్క రుకేష్, బావ అమన్ పునియాలు తనతో గొడవ పడ్డారని, తన బావ దాడి చేసి చంపేస్తానని కూడా బెదిరించాడని ఆమె చెప్పింది.
సోనాలి ఫోగాట్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె సోదరి, సోదరి భర్తపై ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ గొడవ జరిగిందని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతున్నట్టు తెలిపారు.