Begin typing your search above and press return to search.
ఆత్మహత్య చేసుకొన్న టిక్ టాక్ విలన్
By: Tupaki Desk | 7 Oct 2019 11:21 AM GMTతనను తాను పెద్ద విలన్ గా ఫోజులు కొడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోవర్లను సంపాదించుకున్న 30 ఏళ్ల అశ్విని కుమార్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని మరణించటం సంచలనంగా మారింది. టిక్ టాక్ లో పెద్ద ఎత్తున విలన్ క్యారెక్టర్లను వేసిన అతగాడి పైన గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు.
అయితే.. ఇటీవల చోటు చేసుకున్న మూడు హత్యల్లో మాత్రం ఇతగాడిని నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇతడి కోసం వెతుకుతున్నారు. తాను అన్నింటిని నాశనం చేస్తుంటానని.. దయ్యం ఇప్పుడు సిద్ధంగా ఉందని.. తాను క్రియేట్ చేసే విలయాన్ని చూడాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు.
ఇతగాడి తీరు బాగా పాపులర్ కావటంతో.. ఇతడ్ని టిక్ టాక్ విలన్ గా పలువురు అభివర్ణిస్తుంటారు. అలాంటి అతను గత నెల 27న లోకల్ బీజేపీ కొడుకును.. మరో సమీప బంధువుని చంపేసిన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. తన మాట వినటం లేదని ఇంకో యువతిని కూడా దారుణంగా హత్య చేశారన్న ఆరోపణ ఉంది.
ఇతని మీద ఆరోపణలు.. ఫిర్యాదులు రావటంతో ఈ టిక్ టాక్ విలన్ కోసం పోలీసులు వెతుకులాటను షురూ చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లే బస్సులో పారిపోతున్న ఇతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే తనను తాను కాల్చుకున్న అశ్విని ఆత్మహత్య చేసుకొన్న వైనం సంచలనంగా మారింది. ఇంతకీ అతగాడి మీద ఆరోపణలు ఉన్న మూడు అనుమాన్పద హత్యల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఛేదించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.