Begin typing your search above and press return to search.
‘టిక్ టాక్’పై చర్యలు.. కేంద్రాన్ని కోరిన హైకోర్టు
By: Tupaki Desk | 4 April 2019 10:44 AM GMTఫోన్ ఉన్నవారందికీ తెలిసిన యాప్ ‘టిక్ టాక్’. స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లలో బాగా పాపులర్ అయిన యాప్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. చాలామంది డౌన్ లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోల డైలాగ్స్‌ను తామే కొట్టినట్లు, కొన్ని హిట్టు సాంగ్స్ కు డ్యాన్స్ లు చేస్తూ వీడియోలను పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలా వాడడంలో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండడం విశేషం. కొందరు ఒకడుగు ముందుకేసి అశ్లీల డ్యాన్సులు చేసి యాప్‌లో పెడుతున్నారు. ఫలితంగా యువత దానిని అనుకరిస్తూ పెడదారి పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడులోని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలోని మధురైకి చెందిన ముత్తుకుమార్ అనే సామాజిక న్యాయవాది టిక్ టాక్ యాప్ అశ్లీలతను ప్రోత్సహిస్తుందని, దీనిని నిషేధించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. దీంతో టిక్ టాక్ యాప్ ను నిషేధించి, చిన్నపిల్లలు దీని బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈనెల 16లోగా ఏ విషయమైనా తెలియజేయాలని కోరారు.
అలాగే ఎక్కువగా చెడుదారిని ప్రోత్సహించే వీడియోలు ఈ యాప్ లో ఉంటున్నాయని, దీనివల్ల యూత్ బాగా చెడిపోతుందని కోర్టు పేర్కొంది. దీంతో టిక్ టాక్ లో వచ్చిన వీడియోలను మీడియాలో ప్రసారం చేయొద్దని సూచించింది. యువత వ్యక్తిగతంగా తమ ప్రతిభను భయటపెట్టడానికి యాప్ ఉపయోగపడినా అదే సమయంలో ఎక్కువగా అశ్లీలతను ప్రోత్సహిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.. కొందరు యువకులు యాప్ లో వచ్చిన వీడియోలను అనుసరించి ఆత్మహత్యలకు యత్నించారని తెలిపింది.
ఇక తమిళనాడు ఐటి మంత్రి మాట్లాడుతూ భరించలేని డ్యాన్స్ లతో టిక్ టాక్ బూత్ యాప్ గా మారిందన్నారు. ఈ యాప్ తో అమ్మాయిల భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న సంఘాలు టిక్ టాక్ యాప్ నిషేధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందువల్ల ఈ యాప్‌ను త్వరలోనే నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.