Begin typing your search above and press return to search.
అంబానీ చేతికి టిక్ టాక్ పగ్గాలు ?
By: Tupaki Desk | 13 Aug 2020 6:52 AM GMTగాల్వానా లోయ ఘటన తరువాత చైనా పై ప్రతీకార చర్యలో భాగంగా ఇండియా .. డిజిటల్ బ్యాన్ పై దృష్టి పెట్టి, చైనా కి చెందిన దాదాపు 100 కి పైగా యాప్స్ ను ఇప్పటివరకు నిషేధించింది. ఇంకా కొన్ని యాప్స్ పై నిషేధం విధించాలని ఆలోచిస్తుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన టిక్ టాక్ కూడా ఉంది. అయితే , టిక్ టాక్ మళ్లీ ఇండియా లో పాగా వేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ , అవేమి కుదరడంలేదు. ఈ తరుణంలో టిక్ టాక్ గురించి మరో సంచలన వార్త మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆసియా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టిక్ టాక్ ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది.
ఈ మేరకు టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతున్నట్టు మార్కెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. టిక్ టాక్ కి సంబంధించి ఇండియా వ్యాపారాన్ని మొత్తం రిలయన్స్ కు విక్రయించేందుకు బైట్ డాన్స్ సిద్ధం అవుతుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా టిక్ టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ ఐ ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది. రెండు కంపెనీల మధ్య జూలైలో చర్చలు ప్రారంభమైనాయనీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. అయితే, ఈ వార్తలపై రిలయన్స్ ఇంకా స్పందించలేదు.
ఇక , మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన సెప్టెంబర్ 15 గడువుకు ముందే చైనీస్ షార్ట్-వీడియో టిక్ టాక్ లోవాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చల నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. చూడాలి మరి ఈ టిక్ టాక్ ఎవరి సొంతం అవుతుందో ..