Begin typing your search above and press return to search.

ఆ విషయంలో గూగుల్ ను వెనక్కి నెట్టిన టిక్ టాక్

By:  Tupaki Desk   |   26 Dec 2021 7:53 AM GMT
ఆ విషయంలో గూగుల్ ను వెనక్కి నెట్టిన టిక్ టాక్
X
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఫోన్లను తెగ వాడేస్తున్నారు. ఇక వాటిలో అంతర్జాలం. ఇంటర్ నెట్ ను ఒకప్పుడు తెలియని విషయాల కోసం ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఏడుపు వచ్చినా ఫోన్, సంతోషం వచ్చినా ఫోన్.. గొడవ అయినా ఫోన్... ఇలా అన్ని రకాల భావోద్వేగాల్లో ఫోన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆ విధంగా వెబ్సైట్లకు ట్రాఫిక్ పెరిగింది. మరి ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన వెబ్ సైట్లు ఇవే...

సహజంగా ఏ విషయం గురించైనా అదనపు సమాచారం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తారు. అందుకే ముద్దుగా గూగుల్ తల్లి అని కూడా పిలుస్తుంటారు. బ్రౌజింగ్ స్థానంలో ఏటా నంబర్ పొజిషన్ లో ఉండే గూగుల్ ను టిక్ టాక్ ఈ సారి వెనక్కు నెట్టింది. షార్ట్ వీడియో ఫ్లాట్ ఫాం అయిన టిక్ టాక్ ను ప్రపంచంలో ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేసినట్లు తేలింది. ఈ వీడియోలు పిల్లలు, పెద్దలను అలరించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది దీనికోసమే శోధించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ ట్రాఫిక్ గూగుల్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

అత్యధిక మంది చూసిన వెబ్ సైట్లలో గూగుల్ రెండో స్థానానికి పరిమితమైంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో పుష్కలంగా దొరుకుతుంది. ఇకపోతే ఈ ఏడాది మాత్రం సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ మూడో స్థానంలో నిలిచింది. యువతకు మంచి సమాచారంతో పాటు వినోదాన్ని అందించే ఫేస్ బుక్ ద్వారా... సమాచారాన్ని కూడా పంచుకోవచ్చు. ఈ క్రమంలో ఫేస్ బుక్ కు మూడో ప్లేస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది బ్రౌజ్ చేసి సైట్లలో మైక్రోసాఫ్ట్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాన్ని యాపిల్ దక్కించుకుంది. ఆరో స్థానంలో అమెజాన్ నిలిచింది. ఇక ఏడో స్థానంలో ఓటీటీ ఫ్లాట్ ఫాం దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక యూట్యూబ్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. ట్విట్టర్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. సందేశాలకు వేదికగా నిలిచే వాట్సాప్ పదో ప్లేస్ ను దక్కించుకుంది.

ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది నెటిజన్లు సెర్చ్ చేసిన వెబ్ సైట్ల డేటా తాజాగా విడుదలైంది. పైన చెప్పుకున్న వెబ్ సైట్లు టాప్ 10 స్థానంలో నిలిచాయి.