Begin typing your search above and press return to search.
టిక్ టాక్ స్టార్ ఎమ్మెల్యే అవుతుందా?
By: Tupaki Desk | 21 Oct 2019 2:30 PM GMTజనం వేలం వెర్రిగా వాడేస్తున్న టిక్ టాక్ షోలో వీడియోలు చేస్తూ పాపులర్ అయిపోయింది. అందుకే పార్టీ వాళ్ల కన్ను ఆమెపై పడింది. పిలిచి మరీ టికెట్ ఇచ్చేశారు. ఈ పాటికే సినిమా యాక్టర్లకున్నంత క్రేజ్ ని సోనాలీ పొగట్ టిక్ టాక్ వీడియోలు - డబ్ స్మాష్ లు చేస్తూ సంపాదించుకుంది. ఇప్పుడు హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోంది...ఆమె టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగట్. టిక్ టాక్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందా? ఫ్యూచర్ మార్చనుందా? తాజాగా జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో...ఈ హాట్ చర్చ జరుగుతోంది.
బీజేపీ నేత అయిన సోనాలీ భర్త కొన్నేళ్ల క్రితం ఓ వ్యవసాయ క్షేత్ర గృహంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోనాలీ తన ఏడేళ్ల కూతురుతో కలసి జీవిస్తున్నారు. బీజేపీలో కార్యకర్తగా ఉన్న ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చి పోటీలో నిలిపింది. ఇప్పటివరకు అదంపూర్ స్థానం కాంగ్రెస్ కి కంచుకోటగా ఉంది. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ 2000 - 2005 ఎన్నికల్లో రెండుసార్లు ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఈనేపథ్యంలో సోనాలీ గెలుపుని బలంగా బీజేపీ కోరుకుంటోంది. భజన లాల్ కుమారుడైన కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ ఇక్కడి నుంచి బరిలో దిగారు.
చక్కని చీరకట్టుతో బీచ్ లో హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు - జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తున్న వీడియోలు - డబ్ స్మాష్ లు... ఇలా సోనాలీపలు టిక్ టాక్ వీడియోలు చేశారు. ముఖ్యంగా యూత్‌లో ఆమె పాపులర్ అయ్యారు. టిక్ టాక్ లో ఆమెకు 1.20 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోనాలీ సోషల్ మీడియా స్టార్ గా ఎదిగారు. ఆమె ఇప్పటిదాకా 175 వీడియోలు చేశారు.సోనాలీ ఫోగాట్ 1979లో జన్మించారు. ఆమెను సన్నిహితులు సోను అని పిలుస్తుంటారు. .``నన్ను గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమిస్తాను. భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసం ఉంచి..ఆదంపుర్ నియోజకవర్గ టికెట్ ఇచ్చింది. నాకు ఓ అవకాశం కల్పించింది. మేము నిరంతరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి.. హర్యానా వికాసానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఎప్పుడు వచ్చానని అసలు ఆలోచించడం లేదు.. ఇక్కడ విజయం సాధిస్తాను. కమలం వికసించి తీరుతుంది`` అని వెల్లడించారు.