Begin typing your search above and press return to search.

ఇది నిజం..ఒక్కరాత్రిలో 85 లక్షల మందిని పోగొట్టుకున్నాడీ వైజాగ్ కుర్రాడు!

By:  Tupaki Desk   |   6 July 2020 4:00 AM GMT
ఇది నిజం..ఒక్కరాత్రిలో 85 లక్షల మందిని పోగొట్టుకున్నాడీ వైజాగ్ కుర్రాడు!
X
మొన్నటి వరకు వ్యక్తి సంపదను డబ్బుతో కొలిచేవారు. సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ అయ్యిందో లెక్కలు మారిపోయాయి. చేతిలో కోట్లు లేకున్నా.. కోట్లాది రూపాయిల్ని సంపాదించే అభిమాన గణం ఉంటే సరిపోయే పరిస్థితి. టిక్ టాక్ లాంటి ఫ్లాట్ ఫాం పుణ్యమా అని.. లక్షలాది మంది ఫాలోయర్స్ ను సంపాదించుకున్న వారు అందరికంటే సంపన్నులుగా ఉండేవారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాత్రికి రాత్రి వారి పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులైంది. అయితే.. దీనికి వారు బాధ పడటం లేదు. వేదన చెందటం లేదు. దేశం కోసం ఆ మాత్రం పోగొట్టుకోవటం పెద్ద విషయం కాదని తేల్చేయటం విశేషం.

వైజాగ్ టిక్ టాక్ స్టార్ గా సుపరిచితుడు భార్గవ్. ఇతగాడి కి టిక్ టాక్ లో 85 లక్షల మంది ఫాలోయర్స ఉండేవారు. అతడు చేసే వీడియోలకు ఆదరణ ఒక రేంజ్ లో ఉండేది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాత్రికి రాత్రి అతడి పరిస్థితి మొత్తం గా మారి పోయింది. నిన్నటి వరకూ అతగాడు ఒక టీం ను నడిపేవాడు. వచ్చే డబ్బులు వస్తుండేవి. చేసే ఖర్చులు చేస్తుండేవాడు. జేబు లో ఆఖరి రూ.500 ఉన్నప్పుడు టిక్ టాక్ బ్యాన్ వార్త అతని చెవికి చేరింది. అంత లోనే అద్దె కట్టాలన్న ఫోన్.

మామూలుగా అయితే అలాంటి ఫోన్లు లైట్ తీసుకునేవాడు. ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ అయ్యిందో.. అతడి గుండెల్లో రాయి పడింది. బ్యాన్ చేస్తే బ్యాన్ చేశారు కానీ.. ఒక్క వారం ముందే చెప్పి ఉంటే.. వేరేలా ప్లాన్ చేసి ఉండే వాడినన్న మాట అతని నోట వినిపిస్తుంటుంది. అయితే.. బ్యాన్ చేసినందుకు బాధ లేదు. మళ్లీ కష్ట పడి తన ఫాలోయర్స్ ను వేరే వేదిక మీద సొంతం చేసుకుంటానన్న ధీమా ను వ్యక్తం చేస్తున్నాడు. హఠాత్తుగా టిక్ టాక్ ను బ్యాన్ చేశారన్న వార్తతో తాను డిప్రెషన్ కు వెళ్లిపోయానని.. గతంలో ఎవరైనా వేదనలో ఉంటే తాను ఓదార్చే వాడినని.. ఇప్పుడు తనను తన టీం సభ్యులు ఓదారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎంత గుండె కాయ ఉన్నోడికైనా.. రాత్రికి రాత్రి 85 లక్షల మంది ఫాలోయర్స్ ను పోగొట్టు కోవటాన్ని జీర్ణించుకో లేరుగా?