Begin typing your search above and press return to search.
డీఎస్ భవిష్యత్తు తేలిపోయేది ఆరోజే!
By: Tupaki Desk | 6 Aug 2018 5:25 PM GMTతెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌గా తెరమీదకు వచ్చి...అంతే అనూహ్య రీతిలో చల్లారిన సీనియర్ రాజకీయ వేత్త, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్ ఎపిసోడ్ విషయంలో ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టతను సంతరించుకోనుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీ - సీఎం కేసీఆర్ తనయ కవిత సహా నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ సహా ఇతర నేతలను ఢిల్లీలో కలుసుకోవడంతో పాటు - త్వరలో ఆ పార్టీలో చేరబోతారన్న వార్తలు రావడం - డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో దూకుడుగా ముందుకు వెళ్లడం వంటివి ఇందుకు కారణాలని ఒక చర్చ ఉంది. అయితే, కవిత ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే, త్వరలో డీఎస్ పై వేటు ఖాయమని అంటున్నారు. ఇందుకు కారణం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. యూపీఏ ప్రభుత్వంలో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన పీజే కురియన్ కు జూన్ లో పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ పొందారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈ నెల 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు. ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించి.. డిప్యూటీ చైర్మన్ ను ఎంపిక చేయనున్నారు. ఈ ఎన్నిక కోసం నిర్వహించే పోలింగ్ సందర్భంగా డీఎస్ పై వేటు పడనుందని అంటున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో డీఎస్ ఓటుపై టీఆర్ ఎస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయి. పార్టీ నిర్ణయించిన ప్రకారం కాకుండా...ఆయన కాంగ్రెస్ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేస్తే, తాము బలపరిచిన అభ్యర్థి నష్టపోతారన్నది కేసీఆర్ ఆలోచన. ఒకవేళ డీఎస్ గనుక పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓటు వేస్తే...డీఎస్ అంగీకారంతో సంబంధం లేకుండా ఆయనను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడును కోరతారని సమాచారం.
డీఎస్ ను అనర్హుడిని చేసే విషయంలో బీహార్ ఫార్ములాను కేసీఆర్ అమల్లో పెట్టనున్నట్లు సమాచారం. బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్ తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకించారన్న కారణంతో ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ ను పార్టీ నుండి బయటకు పంపడంతో పాటు ఆయన ఎంపీ పదవి నుండి కూడా నితీశ్ కుమార్ తప్పించి సంచలనం సృష్టించారు. ఇది కూడా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాయడం ద్వారానే జరిగింది. సరిగ్గా ఇదే ఫార్ములాలో కేసీఆర్ నిర్ణయం ఉంటుందని టీఆర్ ఎస్ నాయకులు అంటున్నారు.