Begin typing your search above and press return to search.

కాలం మారింది.. కేర్ ఫుల్ గా ఉండండి.. రోడ్డు మీద భర్తను చితక్కొట్టేసింది

By:  Tupaki Desk   |   13 Jan 2020 9:32 AM GMT
కాలం మారింది.. కేర్ ఫుల్ గా ఉండండి.. రోడ్డు మీద భర్తను చితక్కొట్టేసింది
X
లేచింది.. నిద్ర లేచించి మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ ఎన్టీవోడు అప్పుడెప్పుడో గుండమ్మ కథ సినిమాలో పాడిన పాట ఇంకా నిజం కాలేదనే చెప్పాలి. గతంలో పోలిస్తే.. మహిళల్లో చైతన్యం పెరిగినా.. అదేమీ వారికి అవసరమైన ఆర్థిక స్వేచ్ఛను.. సమానత్వాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. కొన్ని వర్గాల వారి విషయం ఇందుకు మినహాయింపు గా చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

ఏదో వంకతో భార్యను.. వారి కుటుంబ సభ్యులను అదే పనిగా వేధించే భర్తగారికి సరైన బుద్ధి చెప్పిందో భార్యామణి. బెంగళూరులోని మారుతీసేవ నగర్ కు చెందిన వినోద్.. దివ్యలకు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే.. భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం దివ్య తన తల్లి వద్ద ఉంటోంది.

అయినప్పటికీ భార్యను ఏదో వంకతో ఇబ్బంది పెట్టేవాడు. ఈ మధ్యన ఇలాంటి వేధింపులు మరింత పెరిగాయి. దీంతో.. సహనం కోల్పోయిన దివ్య తాజాగా.. తనకు బంధువైన కానిస్టేబుల్ సాయం తీసుకొని భర్తను బయటకు పిలిచింది. రోడ్డు మీదకు రాగానే.. అతన్ని ఉతికి ఆరేసింది. తాను వేధిస్తే మౌనంగా ఊరుకునే భార్య.. కాళికలా మారి రోడ్డు మీద పడేసి ఉతికేస్తుంటే బిక్కచచ్చిపోయాడా భర్త. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. టైం మారింది. జాగ్రత్త గా ఉండకుండే మగమహారాజుల తిత్తి తీయటానికి మహిళా మణులేమీ చేత కానివాళ్ల మాదిరి ఉండట్లేదన్నది మర్చిపోకూడదు సుమా.