Begin typing your search above and press return to search.
తాళం తీయటానికి ఆ సీఎం సిద్ధంగా ఉన్నారట
By: Tupaki Desk | 4 May 2020 4:45 AM GMTకరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఎత్తి వేయటానికి కొన్ని రాష్ట్రాలు ససేమిరా అంటుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎప్పుడెప్పుడా? అన్నట్లు ఎదురుచూస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేస్తే వైరస్ వ్యాప్తి జోరు మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామే తప్పించి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాళం వేసి ఉంచే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. తాజాగా ఇలాంటి మాటల్నే చెప్పుకొచ్చారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
లాక్ డౌన్ 3.0 నేపథ్యంలో కేంద్రం కొన్ని మినహాయింపుల్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని యథాతధంగా అమలు చేయటానికి సిద్ధమైన ఢిల్లీ రాష్ట్ర సర్కారు.. పనిలో పనిగా.. లాక్ డౌన్ ఎత్తేయటానికి సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల్ని తాము అమలు చేస్తామన్న కేజ్రీవాల్.. ఎక్కువకాలం లాక్ డౌన్ ను కొనసాగించలేమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారిందన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో రూ.3500 కోట్ల ఆదాయం వస్తే.. లాక్ డౌన్ వేళ రూ.300 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంత భారీగా ఆదాయం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచేదెలా? అన్నది ఆయన ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ అమలు చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్న కేజ్రీవాల్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎక్కువకాలం కొనసాగించలేమన్న విషయాన్ని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కేజ్రీవాల్ మాటల్ని సమర్థిస్తూ పలురాష్ట్రాల సీఎంలు గళం విప్పే అవకాశం ఉందంటున్నారు.