Begin typing your search above and press return to search.

టైమ్ మ్యాగజైన్ ను అమ్మేశారు..కొన్న‌దెవ‌రంటే?

By:  Tupaki Desk   |   17 Sep 2018 11:01 AM GMT
టైమ్ మ్యాగజైన్ ను అమ్మేశారు..కొన్న‌దెవ‌రంటే?
X
ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న వార్తా ప‌త్రిక‌గా పేరున్న టైమ్ మ్యాగ‌జైన్ తాజాగా అమ్ముడుబోయింది. ఇటీవ‌ల కాలంలో పెరిగిన నిర్వాహ‌ణ ఖ‌ర్చుల‌తో పాటు.. న‌ష్టాలు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. టైమ్‌ ను అమ్మేశారు. ఈ ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌ను ఒక జంట త‌మ వ్య‌క్తిగ‌తంగా కొనుగోలు చేయ‌టం విశేషం.

ఈ మ్యాగ‌జైన్ ప్ర‌త్యేక‌త ఏమంటే.. దీన్లో త‌మ క‌థ‌నం ప‌బ్లిష్ అవ్వాల‌ని కోరుకోని సెల‌బ్రిటీలు ఉండ‌రు. అంత‌టి ఇమేజ్ ఉన్న ఈ సంస్థ‌ను ప్ర‌ముఖ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్ ఫోర్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ బెనియాఫ్ దంప‌తులు త‌మ వ్య‌క్తిగ‌తంగా కొనుగోలు చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం టైమ్ మ్యాగ‌జైన్ ను రూ.1378.92 కోట్ల‌కు కొనుగోలు చేశారు. అయితే.. తాము కొనుగోలు చేసిన టైమ్ కు తమ‌కు చెందిన సేల్స్ ఫోర్స్ కు ఎలాంటి సంబంధం లేద‌ని.. త‌మ వ్య‌క్తిగ‌తంగానే ఈ మీడియా సంస్థ‌ను కొనుగోలు చేసిన‌ట్లు ఆ దంప‌తులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని మెరిడెత్ సంస్థ కూడా స్ప‌ష్టం చేస్తోంది. మార్క్ బెనియాప్ దంప‌తులు వ్య‌క్తిగ‌తంగా కొనుగోలు చేశార‌ని.. దీనికి సేల్స్ ఫోర్స్ కు సంబంధం లేద‌ని పేర్కొంది.

ఇదిలా ఉంటే ప‌త్రిక‌కు సంబంధించిన రోజువారీ కార్యాక‌లాపాల్లో మార్క్ బెనియాఫ్ దంప‌తులు ఎలాంటి జోక్యం చేసుకోర‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృంద‌మే నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని చెబుతున్నారు. టైమ్ మ్యాగ‌జైన్ తో పాటు ఫార్చ్యూన్.. మ‌నీ.. స్పోర్ట్స్ ఇల్ల‌స్ట్రేటెడ్ ప‌బ్లికేష‌న్ల‌ను అమ్మ‌కానికి పెట్టారు.

తాజాగా టైమ్ ను అమ్మివేయ‌గా.. మిగిలిన మూడు ప‌బ్లికేష‌న్ల‌ను అమ్మేయ‌నున్నారు. ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు తగ్గిపోవ‌టంతో రాబ‌డి త‌గ్గింది. దీంతో.. మ్యాగ‌జైన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దీంతో.. అమ్మ‌కాల బాట ప‌ట్టింది. టైమ్ ను 1923లో యాలే వ‌ర్సిటీకి చెందిన హెన్నీ లూస్.. బ్ర‌ట‌న్ హాడెన్ లు ప్రారంభించారు. కొత్త యాజ‌మాన్యం కింద ఈ మ్యాగ‌జైన్ జ‌ర్నీ ఎలా ఉంటుందో చూడాలి.