Begin typing your search above and press return to search.
డిజిటల్ యుగంలో పెళ్లి కూతురుకు ఆ మాత్రం ఉండొద్దా?
By: Tupaki Desk | 15 Sep 2022 4:19 AM GMTకాలం మారింది. అందుకు తగ్గట్లే అభిరుల్లోనూ మార్పులు వచ్చాయి. గతానికి భిన్నంగా అమ్మాయిలు స్వతంత్ర్యంగా.. స్వాభిమానంతో బతుకుతున్నారు. అందరూ అని కాకున్నా.. మార్పు చాలానే వచ్చిన పరిస్థితి. ఒకప్పటి అమ్మాయి వేరు.. ఇప్పటి మోడ్రన్ అమ్మాయి వేరు. ఒకప్పటి వరకు ఎందుకు? ఇప్పటికి సైతం పెళ్లి జరిగే వేళ.. అందునా తాళి కట్టే వేళలో కాస్తంత బిగదీసుకుపోయి ఉండిపోవటం చాలానే పెళ్లిళ్లలో చూస్తుంటాం. అక్కడక్కడా మాత్రం అందుకు భిన్నంగా కాస్తంత నవ్వు ముఖంతో దర్శనమిస్తుంటారు.
అయితే.. నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న ఈ వీడియో మాత్రం అందుకు భిన్నం. మనసుకు నచ్చినోడ్ని పెళ్లాడే వేళ.. ఆ అమ్మాయికి కాస్తంత హుషారు ఉన్నదైతే ఎలా ఉంటుంది? తన మనసులోని సంతోషాన్ని ఎలా ప్రదర్శిస్తుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ వీడియో. ఇందులో పెళ్లి కుమార్తె ఆనందం చూస్తే ముచ్చట వేయటమే కాదు.. మరోసారి ఈ వీడియోను చూడటం ఖాయం. పెళ్లి కొడుకు తాళి కడుతున్న వేళ.. ఆ అమ్మాయి పడిన సంబరం చూశాక.. ఇలాంటి ఆనందంతోనే కలకాలం ఉండాలన్న దీవెన ప్రతి ఒక్కరికి అనిపించక మానదు.
తమిళనాడుకు చెందిన ఒక పెళ్లి కుమార్తె.. తన పెళ్లిలో వరుడు తాళి కట్టే వేళలో.. ఆనందంతో ఉప్పొంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో? ఈ పెళ్లి కుమార్తె ఎవరన్నది బయటకు రాలేదు కానీ.. ఈ వీడియోను చూసినప్పుడు వరుడు తాళి కట్టే వేళలో.. ఆ పెళ్లి కుమార్తె పడిన సంతోషం.. అంతకు మించిన సంబరం చూసినంతనే కొత్తగా అనిపించటం ఖాయం.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి.. మీరు కూడా ఇలానే ఉంటారా? అన్నప్రశ్నను సంధించారు. పెళ్లి కుమారుడు తాళి కట్టే వేళలో.. సంబరపడిపోయిన పెళ్లి కుమార్తె ఆనందంతో బిగ్గరగా అరిచినంత పని చేయటమే కాదు.. ఉక్కిరిబిక్కిరి అయిపోతూ చప్పట్లు కొట్టేస్తూ.. ఎంతోకాలంగా ఎదురుచూసిన ఇష్టమైనది దొరికితే సంతోష పడే చిన్న పిల్లలా సంబరపడిపోయింది. మరోవైపు పెళ్లి కుమారుడు మాత్రం తాను వేయాల్సిన మూడు ముళ్లను ఓపిగ్గా వేయగా.. ఆ ఆనంద క్షణాల్ని నూటికి నాలుగు వందల శాతం ఎంజాయ్ చేసింది పెళ్లి కుమార్తె.
అంతేకాదు.. మూడు ముళ్లు వేసిన వరుడుకు వెంటనే.. గట్టి హగ్ ఇవ్వటమే కాదు.. పీటల మీదనే ఘాటు ముద్దు కూడా పెట్టేసి.. తన ప్రేమను వ్యక్తపర్చింది. లవ్లీగా ఉన్న ఈ వీడియోను ఒకటికి రెండుసార్లు చూడటమే కాదు.. ఎవరో ఒకరికి షేర్ చేయాలనిపించటం మాత్రం ఖాయం.
ఈ వీడియోను చూసిన వారిలో కొందరు.. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్నదో? ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటే ఇలాంటి ఆనందమే ఉంటుంది మరి.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ వీడియోను చూసిన తర్వాత.. మరింతమంది పెళ్లి కుమార్తెలు తమ ఆనందాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేయరేమో? డిజిటల్ యుగంలో పెళ్లి కుమార్తెలు ఇలానే ఉంటారేమో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.