Begin typing your search above and press return to search.

టైమ్స్ టాప్ 100 జాబితాలో మ‌నోళ్లు ముగ్గురు.. ఎవ‌రంటే?

By:  Tupaki Desk   |   18 April 2019 5:40 AM GMT
టైమ్స్ టాప్ 100 జాబితాలో మ‌నోళ్లు ముగ్గురు.. ఎవ‌రంటే?
X
ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌భావితం చేసిన వంద మంది అంటూ ప్ర‌ముఖ టైమ్స్ మ్యాగ‌జైన్ ఎంపిక చేసిన వారిలో మ‌నోళ్లు ముగ్గురు స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ గుర్తింపులో రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ పేరు రావ‌టం పెద్ద ఆశ్చ‌ర్యంగా అనిపించ‌దు కానీ.. మ‌రో ఇద్ద‌రికి ఈ గుర్తింపు ల‌భించ‌టం.. వారు అంత‌గా పాపుల‌ర్ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

సామాన్యుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఆ ఇద్ద‌రూ మ‌హిళ‌లే కావ‌టం విశేషం. ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రంటే.. ఒక‌రు అరుంధ‌తి క‌ట్జూ.. మ‌రొక‌రు మేన‌క గురుస్వామి. వీరిద్ద‌రూ మాన‌వ‌హ‌క్కుల కోసం పోరాటం చేసే వారు కావ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. టాప్ పారిశ్రామికవేత్త వ‌రుస‌లో అందుకు ఏ మాత్రం సంబంధం లేని మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కావ‌టం.. వారిద్ద‌రూ సామాజిక కార్య‌క‌ర్త‌లు కావ‌టం ఒక చిత్ర‌మైన కాంబినేష‌న్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌తి ఏడాది ఈ త‌ర‌హాలో టైమ్స్ జాబితాను త‌యారు చేస్తుంటుంది. ప్ర‌పంచాన్ని అత్యంత ప్ర‌భావితం చేసే వివిధ రంగాల‌కు చెందిన వారిని గుర్తించి.. వారి లిస్ట్ ను ప్ర‌క‌టిస్తుంది. ఆ దిగ్గ‌జాల్లో మార్గ‌ద‌ర్శ‌కులు.. నేత‌లు.. క‌ళాకారులు.. వ్యాపార‌.. పారిశ్రామిక‌వేత్త‌లతో పాటు వివిధ రంగాల‌కు చెందిన వారు ఉండ‌నున్నారు.

2019 సంవ‌త్స‌రానికి టైమ్స్ విడుద‌ల చేసిన జాబితాలో ఇండో అమెరిక‌న్ క‌మేడియ‌న్.. టీవీ హోస్ట్ హ‌స‌న్ మిన్ హాజ్.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్.. పోప్ ఫ్రాన్సిస్.. చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్.. గోల్ప్ క్రీడాకారుడు టైగ‌ర్ వుడ్.. ఫేస్ బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు జుక‌ర్ బ‌ర్గ్ ఉన్నారు.

ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్న భార‌త్ కు చెందిన ముగ్గురు ప్ర‌ముఖుల విష‌యానికి వస్తే.. రిల‌య‌న్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కాకుంటే.. ఆయ‌న‌తో పాటు జాబితాలో పేరు ద‌క్కించుకున్న మ‌రో ఇద్ద‌రి విష‌యానికివ స్తే.. ఆ ఇద్ద‌రు స్వ‌లింగ సంప‌ర్కుల హ‌క్కుల కోసం పోరాడిన వారు కావ‌టం గ‌మ‌నార్హం.

సెక్ష‌న్ 377 ప్ర‌కారం దేశంలో స్వ‌లింగ సంప‌ర్కం శిక్షార్హ‌మైన నేరంగా గుర్తింపు ఉంది. దీన్ని నేరం కాదంటూ పోరాడి.. సుప్రీంకోర్టులో విజ‌యం సాధించిన అరుంధ‌తి క‌ట్జూ.. మేన‌క గురుస్వామిలు చోటు ద‌క్కించుకున్నారు.