Begin typing your search above and press return to search.

ఆ ఛాన‌ల్ సొత్తును ఆర్నాబ్ దోచేశాడా?

By:  Tupaki Desk   |   17 May 2017 2:20 PM GMT
ఆ ఛాన‌ల్ సొత్తును ఆర్నాబ్ దోచేశాడా?
X
దేశ వ్యాప్తంగా జ‌రిగే వార్త‌ల్ని ఆస‌క్తిక‌రంగా మ‌లిచే ప్ర‌ఖ్యాత టీవీ జ‌ర్న‌లిస్ట్ ఆర్నాబ్ గోస్వామి త‌ర‌చూ త‌న‌కు తానే వార్త‌గా మారిపోతున్నాడు. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఆయ‌న వార్త‌ల్లోకి వ‌చ్చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న‌పై చోరీ.. న‌మ్మ‌క‌ద్రోహం వ‌గైరా.. వ‌గైరా ప‌లు ఆరోప‌ణ‌ల మీద‌.. వివిధ సెక్ష‌న్ల మీద కేసు న‌మోదు చేసిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న షో ద్వారా యావ‌త్ దేశానికి సుప‌రిచిత‌మైన గోస్వామి.. తాను ప‌ని చేసే టైమ్స్ నౌ ఛాన‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం.. రిప‌బ్లిక్ అనే చాన‌ల్ పెట్టేశారు. ఛాన‌ల్ ను ఫేమ‌స్ చేసిన ఆర్నాబ్.. ఎప్పుడైతే బ‌య‌ట‌కు వెళ్లాడో అత‌నిపై స‌ద‌రు ఛాన‌ల్ ఫిర్యాదు చేసేసింది.

త‌న కార్య‌క్ర‌మం భాగంగా ఆయ‌న నోటి నుంచి త‌ర‌చూ వ‌చ్చే ఫేమ‌స్ డైలాగ్‌.. 'ద నేష‌న్ వాంట్స్ టు నో' (ఈ దేశం తెలుసుకోవాల‌నుకుంటోంది) త‌మ సొంత‌మ‌ని.. దాన్ని ఆర్నాబ్ కానీ ఉప‌యోగిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ విష‌యం మీద అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

దీన్ని క‌ట్ చేస్తే.. తాజాగా త‌న రిప‌బ్లిక్ ఛాన‌ల్ లో ఉప‌యోగించిన వీడియో టేపుల మీద టైమ్స్ నౌ కేసు న‌మోదు చేసింది. రిప‌బ్లిక్ ఛాన‌ల్ లో ఇటీవ‌ల కేంద్ర మాజీ మంత్రి శ‌శిథ‌రూర్ స‌తీమ‌ణి..సునంద పుష్క‌ర్ అనుమానాస్ప‌ద మృతి మీద ప్ర‌సారం చేసిన వార్త‌ల‌కు సంబంధించి వినియోగించి ఫుటేజ్ త‌మ‌ద‌ని.. త‌మ ద‌గ్గ‌ర ఆర్నాబ్ చోరీ చేసిన‌ట్లుగా టైమ్స్ నౌ ఛాన‌ల్ ఆరోపిస్తోంది.

ఆయ‌న‌పై వివిధ సెక్ష‌న్ల కింద ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన అధికారులు ఆర్నాబ్ మీద ఐపీసీ సెక్ష‌న్ 378 - 403 - 405 - 406 - 409 - 411 - 414 - 418 సెక్ష‌న్లతో పాటు ఐటీ చ‌ట్టం 2000 కింద 66బీ - 72 - 72ఏల కింద కేసు న‌మోదు చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామంపై ఆర్నాబ్ ఇంకా స్పందించ‌లేదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/