Begin typing your search above and press return to search.
టైమ్స్ సర్వే.. టీఆర్ ఎస్ గెలిచేది అంతేనా?
By: Tupaki Desk | 31 Jan 2019 8:57 AM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ముందు జాతీయ చానెల్లన్నీ టీఆర్ ఎస్ దే అధికారం అని ఢంకా బజాయించాయి. ఆంధ్రా అక్టోపస్ లగడపాటి మాత్రం కాంగ్రెస్ దే జయం అన్నారు. కానీ ప్రజలు మాత్రం టీఆర్ ఎస్ కే పట్టం కట్టారు. ఈ విషయంలో జాతీయ చానెల్ల అంచనాలు కరెక్టయ్యాయి. అయితే తాజాగా పార్లమెంట్ ఎన్నికలపై కూడా ప్రముఖ జాతీయ చానెళ్లు సర్వేలు విడుదల చేస్తున్నాయి. అందులో టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతున్నాయి.
తాజాగా ప్రముఖ జాతీయ చానెల్ టైమ్స్ నౌ మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ కు షాక్ తగలడం ఖాయమని సర్వే విడుదల చేసింది. ఈ చానెల్ సర్వే ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ పుంజుకునే అవకాశాలున్నాయని తెలిపింది. కాంగ్రెస్ ఏకంగా ఐదు ఎంపీ సీట్లలో గెలుస్తుందని ఈ సర్వే అంచనావేసింది. అదే సమయంలో టీఆర్ ఎస్ కేవలం పది స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే చెబుతోంది. ఎంఐఎం యథాతథంగా ఒక హైదరాబాద్ సీటు గెలుస్తుందని వివరించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ సీటును నిలబెట్టుకుంటుందని తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ ఎస్ కు ఎదురులేకుండా ఉంది. అసెంబ్లీని క్లీన్ స్వీప్ చేసిన కారు.. లోక్ సభలోనూ అదే జోరు కొనసాగించే అవకాశాలున్నాయి. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ సహా అన్నీ సర్వేలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. మరి టౌమ్స్ నౌ అంచనాలు ఇలా ఉండడం .. ఫలితాల్లో మరీ తేడాగా ఉండడంతో రాజకీయవర్గాల్లో సంశయం నెలకొంది. పూర్తి ఫలితం వచ్చే వరకూ ఈ సర్వేల ఉత్కంఠ తప్పేలా కనిపించడం లేదు.