Begin typing your search above and press return to search.
టైమ్స్ నౌ పోల్: ఆప్ కు 54-60సీట్లు, బీజేపీకి 10-14
By: Tupaki Desk | 4 Feb 2020 5:26 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి షాక్ తప్పదని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ స్పష్టం చేసింది. తాజాగా టైమ్స్ నౌ చేసిన పోల్ లో సంచలన విషయం బయటపడింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 54 నుంచి 60 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని తేల్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 10-14 సీట్లకే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది.
గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఏకంగా ఢిల్లీలో 7 లోక్ సభ సీట్లను గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. అయితే పార్లమెంట్ లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీకే అధికారం ఇవ్వబోతుండడం విశేషంగా మారింది.
గత లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ లో బీజేపీకి 46శాతం ఓటు బ్యాంకురాగా.. ఆప్ కు 38శాతం వచ్చింది. కానీ ఏడాదిలోనే ఆప్ ఇంత భారీగా పుంజుకుంటుందని టౌమ్స్ నౌ తేల్చింది.
ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం బీజేపీకి ప్లస్ గా మారినా ఓట్లను రాల్చలేదని సమాచారం. సీఏఏ ను ఢిల్లీ ప్రజలు ఏకంగా 71శాతం మంది సపోర్టు చేశారు. అయినా కేజ్రీవాల్ కే సపోర్టు గా నిలవడం విశేషం.