Begin typing your search above and press return to search.

టైమ్స్ నౌ స‌ర్వే: తెలంగాణ టీఆర్ ఎస్‌ దే

By:  Tupaki Desk   |   23 Nov 2018 4:26 PM GMT
టైమ్స్ నౌ స‌ర్వే: తెలంగాణ టీఆర్ ఎస్‌ దే
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యం స‌మీపిస్తున్న క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర స‌మితికి తీపిక‌బురు ద‌క్కింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ కే పట్టం కట్టనున్నారని మ‌రో సర్వే తేల్చింది. టీఆర్ ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌ నౌ ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను - టీడీపీ 2 - ఎమ్ ఐ ఎమ్ 8 - బీజేపీ 3 - ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది. ఓ వైపు మేడ్చ‌ల్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ - రాహుల్ గాంధీ స‌భ జ‌రుగుతుండ‌గా ఆ పార్టీ నేత‌లు అవాక్క‌య్యేలా ఈ స‌ర్వే తెర‌మీద‌కు వ‌చ్చింది.

టైమ్స్ నౌ స‌ర్వే ప్ర‌కారం - తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 శాతం ప్రజలు కోరుకోగా... ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55 - కోదండరాంకు 3.37 శాతం మద్దతు లభించింది. ఇక.. టీఆర్ ఎస్‌ కు 37.55 శాతం ఓట్లు వస్తాయని.. కాంగ్రెస్‌ కు 27.98 శాతం - టీడీపీకి 5.66 - ఎమ్ ఐఎమ్‌ కు 4.10 శాతం - బీజేపీకి 11 శాతం - ఇతరులకు 13.71 శాతమని సర్వే వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని 45.73 శాతం ప్రజలు తెలుపగా.. కాంగ్రెస్ వైపు 32.90 శాతం ప్రజలు ఉన్నారని సర్వే వెల్లడించింది. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిందని 52.44 శాతం ప్రజలు తెలిపినట్లు సర్వే ప్రకటించింది.