Begin typing your search above and press return to search.
టైమ్స్ నౌ సర్వే: ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపంటే?
By: Tupaki Desk | 25 March 2021 4:30 AM GMTదేశంలోన 5 కీలక రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికలు కేంద్రంలోని బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మినీ సంగ్రామంలా మారిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘టైమ్స్ నౌ-సీఓటర్’ సర్వే వెల్లడైంది. కేంద్రంలోని బీజేపీకి ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మరో రాష్ట్రంలో కూడా అధికారం దక్కనుందని తేలింది. అయితే బెంగాల్ లో మాత్రం మమత ముందు బీజేపీ పప్పులు ఉడకవని తేలింది.
రాష్ట్రాల వారీగా చూస్తే టైమ్స్ నౌ సర్వేలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 46 శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని తేలింది. అన్నాడీఎంకే-బీజేపీ దారుణంగా ఓడుతుందని స్పష్టం చేసింది. కేవలం 34.6శాతం ఓట్లకే పరిమితం అవుతుంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్ 173-181 సీట్లు సాధిస్తుందని.. ఎన్డీఏ-అన్నాడీఎంకే కలిసి 45-43 సీట్లకే పరిమితం అవుతుందని తేలింది. కమల్ హాసన్ పార్టీ 1 సీటుకే పరిమితం కావచ్చని తెలిపింది. దీంతో స్తాలిన్ సీఎం కావడం ఖాయమని తేలింది.
బెంగాల్ లో మమతా బెనర్జీకి బీజేపీ గట్టి పోటీనిస్తుందని తేలింది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించబోదని సర్వే తేల్చింది. 294 అసెంబ్లీ సీట్లు ఉన్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కు 152-168, బీజేపీకి 104-120, కాంగ్రెస్ కూటమి 18-26 వస్తాయని తేలింది.
అయితే అసోం రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేలింది.ఎన్డీఏ 65-73, మహాజోత్ కూటమికి 52-60, ఇతరులు 0-4 వస్తాయని తేలింది.
పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని తేలింది. ఎన్డీఏ 19-23, కాంగ్రెస్ డీఎంకే 7-11 వస్తాయని తేలింది.
ఇక కేరళ లో వామపక్షాలదే మళ్లీ రాజ్యం అని తేలింది. వామపక్షాల అధికార ఎల్డీఎఫ్ కూటమి 77 సీట్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ యూడీఎఫ్ 62 స్థానాలు సాధిస్తుందని తేలింది.
మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ ఖాతాలో అసోం - పుదుచ్చేరి మాత్రమే పడడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్ లో దీదీ ధాటికి ఓటమియే బీజేపీకి ఎదురుకానుంది.