Begin typing your search above and press return to search.
ఆ పని చేస్తే కాలి బూడిదేనన్న మోడీ బ్యాచ్ పాత ఫ్రెండ్!
By: Tupaki Desk | 29 July 2019 7:30 AM GMTఒక పొరపాటును వెంటనే సరిదిద్దితే జరిగే నష్టం చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. జరిగిన పొరపాటును కవర్ చేసుకుంటూ పోతేనే అసలు ఇబ్బంది. ఒక వ్యక్తి విషయంలో ఇలా ఉంటే.. ఒక దేశం విషయంలో ఇలాంటి పొరపాటు జరిగితే చెల్లించే మూల్యం కశ్మీర్ వ్యాలీగా చెప్పక తప్పదు. నాటి ప్రధాని తన రాజకీయ ప్రయోజనాలు కావొచ్చు.. లేదంటే అప్పట్లో ఆయన ఆలోచన అంతవరకే ఆగిందో.. మరింకేమైనా మనసులో పెట్టుకున్నారో కానీ.. కశ్మీర్ విషయంలో ఆయన చేసిన తప్పులు నేటికి వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి.
కశ్మీర్ ప్రత్యేకమే కానీ.. ఆ పేరుతో ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేసేలా అక్కడి నేతల్ని కట్టడి చేయాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు సరికదా.. ఆ చలిమంటతో రాజకీయ ప్రయోజనాల్ని ఆశిస్తూ.. చేయూడని తప్పులెన్నో చేశారు. తొలి రోజుల్లోనే కశ్మీర్ విషయంలో కరకుగా ఉండి ఉంటే.. ఈ రోజున ఆ వ్యాలీ పరిస్థితి మరోలా ఉండేది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరే ఉంటే.. కశ్మీర్ మరో పెద్ద నగరంగా అవతరించటమే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితి మరోలా ఉండేలా తోడ్పాటు అందించేది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ కశ్మీర్ కు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు చెక్ చెబుతూ.. ఇప్పుడు కొత్త పంథాలో వెళ్లాలన్నట్లుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా దాదాపుగా 50 వేలకు పైనే అదనపు సైనిక బలగాల్ని కశ్మీర్ గడ్డ మీద తీసుకెళుతున్న వైనంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్టికల్ 35ఏ ను రద్దు చేయటానికో.. ఆర్టికల్ 370ను తీసివేయాలన్న ఉద్దేశంతోనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతన్న విషయంపై క్లారిటీ రానప్పటికీ.. కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు ఏదో ఒక ఆలోచనకు వచ్చినట్లుగా చెప్పక తప్పదు. రాచపుండుగా మారిన కశ్మీర్ కు ఏదో ఒకరు శస్త్రచికిత్స జరగాల్సిందే. అది మోడీ హయాంలోనే పూర్తి అయితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.
ఈ రోజున దేశంలో హిందువుల్లో అసహనం పెరుగుతుందన్న మాటను పలువురు మేధావులు చెబుతుంటారు. కానీ.. అదంతా ఇన్ సెక్యురిటీ వల్లేనని ఎందుకనుకోరు? తమ ధర్మానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడటంతో.. తమ ఉనికిని చాటుకోవటానికి వీలుగా చైతన్యంతో ఉన్నారెందుకు అనుకోరు? ప్రపంచంలోని ఏ ప్రాంతంలో అయినా మెజార్టీలు మైనార్టీలుగా ఉన్న పరస్థితి ఉందా? అంటే లేదనే చెబుతారు. అలాంటప్పుడు భారత్ లోని చాలా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయన్న మాటను పలువురు చెబుతుంటారు.
మైనార్టీలకు రక్షణే ధ్యేయమన్నట్లుగా మాట్లాడే పెద్దమనుషులు..కశ్మీర్ లోని మైనార్టీ హిందువుల్ని తరిమి తరిమి కొట్టిన వైనంపై ఎందుకు గొంతు విప్పలేదన్న ప్రశ్నకు ఈ రోజుకు సమాధానం రాదు. ఒక శాసనసభలో తమ అధినేత మీద ప్రేమతోనో.. మమకారంతోనే సదరు నేత దేవుడితో సమానం అన్నట్లుగా పొగిడే క్రమంలో పారపాటున అల్లా పేరు ప్రస్తావించినంతనే క్షమాపణలు చెప్పాలనే అసద్ లాంటి వారు.. తాము మాట్లాడే సందర్భంలో అలాంటి పరిమితులు ఎందుకు పాటించరన్న ప్రశ్న ఎందుకు రాదు?
ఇప్పటికి జరిగింది జరిగిపోయింది. కానీ.. ఇప్పటికైనా సరే.. మొహమాటాలకు పక్కన పెట్టేసి.. కశ్మీర్ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.అందులో భాగంగా మోడీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై తాజాగా ఆ పార్టీ మాజీ మిత్రురాలు కమ్ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా అనిపించక మానదు.
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏ జోలికి వెళ్లటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటంగా ఆమె హెచ్చరించారు. ఆ ఆర్టికల్ ను తొలగించే ప్రయత్నం చేస్తే కాలి బూడిద అవుతారని ఆమె హెచ్చరించటం దేనికి నిదర్శనం. కశ్మీర్ వ్యాలీలో దాయాది పాక్ సాయంతో పెద్ద ఎత్తున నిధులు.. ఆయుధాలు తీసుకొని తీవ్రవాదాన్ఇన విస్తరించే శక్తుల మీద విరుచుకుపడే దమ్ము లేని మెహబూబా లాంటోళ్లు.. కేంద్రప్రభుత్వాన్ని మాత్రం మాడిపోతారు.. మసైపోతారు? లాంటి హెచ్చరికలు చేయటమా? వాస్తవానికి ఆర్టికల్ 35 ఏ అధికరణం పరిమితకాలానికని చెప్పిన విషయాన్ని ఆమె ఎందుకని కావాలని మర్చిపోతుంటారు. దేశంలో భాగం కశ్మీర్. మిగిలిన రాష్ట్రాల మాదిరి ఆది కూడా దేశంలో ఒక భాగమన్న విషయంలో ఆశేషభారతావని ఒక్కతాటిలో ఉంటే తప్పించి కశ్మీర్ సమస్య ఒక కొలిక్కి రాదని చెప్పక తప్పదు. లేకుంటే.. భారతమాత నుదిటి సింధూరమైన కశ్మీరం ఎప్పటికి రగిలిపోతూ.. రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది.