Begin typing your search above and press return to search.

ఎఫైర్స్ గోల.. బంధాలు దారితప్పొదంటే?

By:  Tupaki Desk   |   7 May 2020 8:00 AM IST
ఎఫైర్స్ గోల.. బంధాలు దారితప్పొదంటే?
X
బంధాలు.. అనుబంధాలు.. ఏదైనా నిలబెట్టుకుంటునే నిలబడుతుంది. ఆగ్రహంతో నోరుపారేసుకుంటే కూలుతుంది. కరోనా వేళ చాలా మంది ఎఫైర్స్ బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో అయితే ఒక యువతికి నలుగురు బ్యాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని.. కరోనా గుట్టు తేలిస్తే బయటపడింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఆఫీసులో పెట్టుకున్న అక్రమ సంబంధం వెలుగుచూసింది.

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు బాగా ఎక్కువైపోయాయి. అందుకే ఇలాంటి కరోనా టైంలో అవి దరిచేరకుండా బంధాలు బలంగా ఉండేలా చూసుకోండి. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎఫైర్స్ అయినా.. ఇంకా ఏ సంబంధమైనా.. ఘర్షణ అయినా మీ మధ్య తలెత్తితే దానిని పెద్దది చేసే బదులు దానికి పరిష్కారం చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదుటివారు తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే వెంటనే అడిగేస్తే తెగే దాకా పోదంటున్నారు.. అంతేకానీ బయటి వ్యక్తులతో చర్చిస్తే అది రచ్చ అవుతుంది. అగ్నికి ఆజ్యం పోసే వారితో కాపురాలు కూలిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

ఇక బంధాలు, ఎఫైర్స్ , ఘర్షణలు,వివాదాలు ఏవైనా సరే మీ భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అసలు సమస్య ఏంటో కనుక్కొని పరిష్కరించాలని సూచిస్తున్నారు. అలా చేస్తే వాళ్లలో తప్పకుండా మార్పు వచ్చి బంధాలు బలపడుతాయని చెబుతున్నారు. సో ఈ కరోనా వేళ కూలుతున్న కాపురాలను ఇలా సమన్వయంగా సరిచేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.