Begin typing your search above and press return to search.
టిప్పు సుల్తాన్ గొప్పోడేమీ కాదు
By: Tupaki Desk | 16 Nov 2015 11:19 AM GMTకర్ణాటకలో టిప్పు సుల్లాన్ ఇప్పుడు వివాదాస్పద వ్యక్తిగా మారారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన సుల్తాన్ గా ఇంతవరకు చరిత్ర ద్వారా ప్రజలు చెప్పుకొంటున్నప్పటికీ ఆయన అసలు చరిత్ర వేరన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది. వర్తమాన రాజకీయాల్లో వైరాల కారణంగా చరిత్రను తవ్వి టిప్పు సుల్తాన్ ను కథేంటో బయటకు తీస్తున్నారు. ఇంతవరకు చరిత్రలోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ టిప్పు సుల్తాన్ గురించి చదివినవారికి ఆయనపై ఉన్న అభిప్రాయం పోయేలా రాజకీయాలు కారణమవుతున్నాయి. ఇందుకు కర్ణాటక ప్రభుత్వాన్నే తప్పు పట్టాల్సి ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న అసహనంపై అంతటా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దక్షిణాదిలో బీజేపీకి పట్టుకున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని పరిస్థితులను అడ్డంపెట్టుకుని బీజేపీని ఇరుకున పెట్టేందుకు వేసిన ఎత్తుగడ టిప్పుసుల్లాన్ మెడకు చుట్టుకుంది. కేంద్రంలో హిందూ పక్షపాత ప్రభుత్వం ఉందన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా లౌకికవాదులు, ఆ ముసుగు కప్పుకొన్నవారు పరమత సహనం పేరుతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని ఇదే సమయంలో ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. అంతేకాదు... ఎన్నడూ లేనట్లుగా ఈసారి టిప్పు జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించడం కూడా వివాదంగా మారింది. దీంతో బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య రాజకీయ వేడి రగులుకుంది. ఈ వేడి చినికిచినికి గాలివానగా మారి అసలు టిప్పు సుల్తాన్ భారత్ కు చేసిందేంటన్న ప్రశ్న మొదలైపోయింది. దాంతో చరిత్రను తవ్వితీసి సుబ్రహ్మణ్య స్వామి వంటి బీజేపీ నేతలు టిప్పు గొప్పదనమేమీ లేదని.. ఆయన ఫ్రెంచివారికి బానిస అంటూ కొత్త వాదాన్ని తెరపైకి తెస్తున్నారు.
టిప్పు సుల్తాన్ అంత గొప్ప వ్యక్తేమీ కాదని... కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు నిర్వహించాల్సినంత గొప్పోడేమీ కాదని తేల్చారు. టిప్పుసుల్తాన్ తనంతట తానుగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడలేదని.. ఫ్రెంచ్ వారి తరఫునే బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడాడని చెప్పారు. ఆఫ్రికాతో యుద్ధానికి సిద్ధమైన ఫ్రాన్స్ అధినేత నెపోలియన్.. భారత్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు టిప్పు సుల్తాన్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు. కాగా చరిత్రను పూర్తిస్థాయిలో పరిశీలించినవారు కూడా ఇదే వాస్తవమని అంటున్నారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడన్నదే చూస్తున్నారు కానీ, ఆయన ఎవరికోసం పోరాడాడు? భారత్ కోసమా.. ఫ్రెంచివారి కోసమా అన్నది ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదని పలువురు అంటున్నారు. అంతేకాదు... చరిత్రను శోధించినా అదే విషయం బోధపడుతుంది. ఫ్రెంచి వారితో ఒప్పందం చేసుకుని బ్రిటిషర్లతో పోరాడిన టిప్పు సైన్యానికి ఫ్రెంచివారు శిక్షణ కూడా ఇస్తారు. ఫ్రెంచివారి నుంచి శిక్షణ పొందిన సైన్యం, ఆ ఆయుధాలతో టిప్పు సుల్తాన్, అతని తండ్రి హైదర్ ఆలీ తమ పొరుగు రాజ్యాలైన మహారాష్ట్ర, మలబార్, కొడగు, బిదనూర్, ట్రావెన్ కోర్ రాజులతోనూ పోరాడారని చరిత్ర చెబుతోంది.