Begin typing your search above and press return to search.
మాజీ సీఎస్ విచిత్ర డిమాండ్..తిరుమలను కరోనా ఆస్పత్రి చేయాలంట!
By: Tupaki Desk | 29 March 2020 5:30 AM GMTకరోనా వ్యాప్తి చెందుతుండడంతో దాని కట్టడికి విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్షేత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దాంతో పాటు కాటేజీలు - గదులు - అతిథిగృహాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిని వినియోగించాలని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా వైరస్ బాధితుల కోసం ఆస్పత్రి ఏర్పాటుచేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో సాగుతున్న డిమాండ్ ను పరిశీలించిన ఓ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కూడా వత్తాసు పలికారు. ఆ డిమాండ్ బాగుందని.. ప్రభుత్వం అమలుచేయాలని కోరడంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దాదాపు 27 వేల మంది ఏపీలో విదేశాల నుంచి వచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ క్వారంటైన్ - ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ప్రస్తుతం సరిపడా స్థలాలు - ఆస్పత్రులు లేవు. దీంతో తిరుమలలో ఉన్న అతిథిగృహాలు - గదులను వినియోగించాలనే డిమాండ్ వస్తోంది. తిరుమలను ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని చూసిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి - బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు మద్దతు పలికాడు. గుడ్ ఐడియా అంటూ మెచ్చుకున్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. తిరుమలలో కరోనా ఆస్పత్రి ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని - వందల సంఖ్యలో గదులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అయితే పవిత్రమైన ఆలయ పరిసరాల్లో కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే నిర్ణయం సరికాదని ఈ ప్రతిపాదనను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆలయాన్ని రోగులకు నిలయంగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.