Begin typing your search above and press return to search.

తిరుమల: 35 రోజుల టికెట్లు అరగంటలో క్లోజ్ !

By:  Tupaki Desk   |   25 Sep 2021 10:30 AM GMT
తిరుమల: 35 రోజుల టికెట్లు అరగంటలో క్లోజ్ !
X
ఏడు కొండలవాడు .. కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కొంచెం ఎవరు వేచి చూడరు. కోట్లాది మంది శ్రీవారి దర్శనం ఎప్పుడు లభిస్తుంది.ఆ శ్రీవారి రూపం చూసి కన్నులు తరించేది ఎప్పుడు అని తాతహలాడుతుంటారు. గతంలో రోజుకి లక్ష మందికి పైగా శ్రీవారిని దర్శనం చేసుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత శ్రీవారి దర్శనం దొరకాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం 300 రూపాయల దర్శనం, సర్వదర్శనం మాత్రమే ఉన్నాయి. సర్వదర్శనం టికెట్స్ తిరుపతి లో కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత , భక్తుల సంఖ్య పెరిగిపోతుండటం తో కరోనా మహమ్మారి కారణంగా .. ఆ టికెట్స్ కూడా ఆన్లైన్ లోనే విడుదల చేశారు.

ఇక, శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో ఇవాళ విడుద‌ల చేసిన స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు కేవలం 30 నిముషాల్లోనే అయిపోయాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మేర‌కు శ‌నివారం సెప్టెంబ‌ర్ 26 నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కూ స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌ లైన్‌ లో అధికారులు విడుద‌ల చేశారు. రోజుకు 8 వేల‌ చొప్పున 35 రోజుల‌కు గాను 2,80.000 టికెట్ల‌ను .భ‌క్తులు కేవ‌లం 30 నిమిషాల్లో బుక్ చేసుకున్నారు. గ‌తానుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంది. టీటీడీ విధించిన కోవిడ్ నిబంధ‌న‌లు భ‌క్తులు పాటించి ద‌ర్శ‌నానికి రావాల‌ని అధికారులు కోరారు.

తాజాగా ఒక దర్శన స్లాట్ కోసం దాదాపు 5.5 లక్షల మంది పోటీ పడినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను విడుదల చేసిన వెంటనే.. 1.06 లక్షల మంది సైట్‌లో లాగిన్ అయ్యారు. క్షణాల వ్యవధిలోనే ఆ సంఖ్య 5.5 లక్షలకు చేరుకుంది. ఇంత పోటీని చూసి టీటీడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య పెరుగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వచ్చే భక్తులకు పలు నిబంధనలు విధించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిపికెట్ తప్పనిసరిగా చూపాలని ఆలయ ఈవో జవహార్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే.. మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ సర్టిఫికెట్ అయినా తీసుకురావాలన్నారు. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు.

అయితే, 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఈ నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ఇక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారికి దర్శనం తేదీ నుంచి 72 గంటల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారికి రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకున్న సర్టిఫికెట్, లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ నిబంధనలుపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు సడలింపు ఉంటుందని, అక్టోబర్ 1వ తేదీ నుంచి పక్కా అమలు చేయడం జరుగుతుందని ఈవో చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.