Begin typing your search above and press return to search.
టీడీపీ - బీజేపీకి తిరుపతి కష్టం ?
By: Tupaki Desk | 16 March 2021 11:30 PM GMTఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ కొట్టిన దెబ్బ ఏపీలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎన్టీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఎప్పుడూ ఇంతటి ఘనవిజయం దక్కలేదు.. ఇంతటి ఘోర పరాజయమూ లేదు. కనీసం కీలక నేతలు ఉన్న చోట్ల అయిన పట్టు నిలుపుకుంటారని ఆశిస్తే అది కూడా జరగలేదు. ఇక ఇదంతా ఇప్పుడు గతమే.. ఇప్పుడు టీడీపీ - జనసేనకు తిరుపతి ఉప ఎన్నిక రూపంలో ముందుంది ముసళ్ల పండగ. అసలు ఈ ఉప ఎన్నికను ఎలా ? ఎదుర్కోవాలో కూడా తెలియక ఈ రెండు పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ పోటీ చేయకుండా చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యి బీజేపీని ఇరికించేశారే అనుకోవాలి.
ఇక పుర పోరులో చంద్రబాబు..పవన్ కళ్యాణ్..సోము వీర్రాజు ఎవరి ప్రభావం కన్పించకుండా అన్ని చోట్లా వైసీపీ ఊడ్చేసింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో టీడీపీకి డిపాజిట్లు రాగా... బీజేపీ + జనసేన అభ్యర్థులకు ఒక్కటంటే ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు. ఈ లెక్కన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయానికి రెడీ అయ్యిందనే చెప్పాలి. మరో ట్విస్ట్ ఏంటంటే ఇటీవల ఈ పార్లమెంటు పరిధిలో కాపు సంఘాలు తరచూ సమావేశం అవుతూ తాము బీజేపీకి మత్రం ఓటు వేసే ప్రశక్తే లేదని.. అవసరం అయితే నోటాకు ఓటు వేస్తామే తప్పా బీజేపీకి ఓట్లేయమని తీర్మానాలు చేస్తున్నాయి.
తిరుపతి లోక్ సభ సీటు గెలిపిస్తే కేంద్ర మంత్రి అని ప్రచారం చేసేందుకు కూడా బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ జనసేన పోటీ చేయకపోయినా కూడా పవన్ అభిమానులు, కాపులు మాత్రం ఆ పార్టీని ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేదు. ఓ వైపు ఏపీకి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేసింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో మరింత రగులుతోన్న ఆంధ్రా జనం బీజేపీని తిరుపతిలో ఎంత లోతు బొందలో పెడతారో ? చూడాలి. మరో విశేషం ఏంటంటే ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న దాసరి శ్రీనివాసులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తితో లేరట.
ఇక టీడీపీ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఆ పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో తమ అభ్యర్ధి పనబాక లక్ష్మీ అని ఎప్పుడో ప్రకటించింది. కానీ ఆమె అసలు ఈ విషయాన్ని పట్టించుకోవటం మానేసి చాలా కాలమే అయింది. అసలు ఈ ఎన్నికల ఫలితాలకు ముందే ఆమెకు పోటీ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఆమె పోటీ చేసేందుకు ఎంత మాత్రం ముందుకు వచ్చే ఛాన్సులే లేవంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు బీజేపీ, టీడీపీ ఈ ఉప ఎన్నికకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాయి.