Begin typing your search above and press return to search.

టీడీపీని తిరుపతిలో ‘రాబిన్’ గట్టెక్కించగలడా?

By:  Tupaki Desk   |   22 March 2021 5:30 PM GMT
టీడీపీని తిరుపతిలో ‘రాబిన్’ గట్టెక్కించగలడా?
X
ఏపీ సీఎం జగన్ పక్కన దేశంలోనే టాప్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో గెలిపించాడు. ఇప్పుడు చంద్రబాబు పక్కన పీకే శిష్యుడైన రాబిన్ శర్మ వచ్చి చేరాడు. చంద్రబాబు స్వయంగా ఆయనకే తిరుపతి ఉప ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించారు.

ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ విడిపోయి వేరుకుంపటి పెట్టాడు. రాజకీయ వ్యూహకర్తగా మారాడు. ఆ తర్వాత ఆయనతోనే చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకొని గెలుపు బాధ్యతలను రాబిన్ కు అప్పగించారు.

ఇప్పుడు రాబిన్ కు టీడీపీ తరుఫున తొలి టాస్క్ వచ్చింది. తొందరలో జరుగబోతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రాబిన్ వ్యూహాలు ఏమిటో తేలిపోతుంది. వైసీపీకి గెలుపు పక్కా అని తేలినా టీడీపీ ఎంత గట్టిగా పోరాడుతుందనేది రాబిన్ వ్యూహాలను బట్టి తెలుస్తుంది.

రాబిన్ వ్యూహాలు ఫలిస్తాయా? 2023వరకు ఆయన సేవలు అవసరమా లేదా అన్నది కూడా చంద్రబాబుకు ఓ క్లారిటీ వస్తుంది. టీడీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో పరువు కాపాడుకుంటే రాబిన్ పనితనం కొనసాగుతుంది. లేదంటే ఆయన పోస్ట్ కష్టమేనంటున్నారు. అయినా ప్రజల్లోకి వెళ్లి మమేకం అయ్యి గెలవాలి కానీ.. ఇలా వ్యూహకర్తలను నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లకపోతే ఏ దేవుడొచ్చినా గెలిపించలేరని అంటున్నారు.