Begin typing your search above and press return to search.

జనసేనాని గొంతు మూగబోయిందా?

By:  Tupaki Desk   |   27 March 2021 5:19 AM GMT
జనసేనాని గొంతు మూగబోయిందా?
X
ఈ విషయంపైనే ఇపుడు గందరగోళం పెరిగిపోతోంది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభను అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించి 24 గంటలు అయిపోయింది. అయినా ఇంతవరకు అధికారికంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ కనబడలేదు. కనీసం తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతానుండి కానీ లేకపోతే జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతానుండి కానీ ఎలాంటి ప్రకటన కనబడలేదు. అయితే పవన్ ఇంటికి వీర్రాజు, రత్నప్రభ, పురంధేశ్వరి వెళ్ళి ప్రచారానికి రమ్మని కోరారు.

ఒకవైపు బీజేపీ నేతలేమో పవన్ అంగీకారంతోనే రత్నప్రభను అభ్యర్ధా ప్రకటించిందని చెప్పేసుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని పవన్ మాత్రం కన్ఫర్మ్ చేయటంలేదు. పైగా అభ్యర్ధికి అభినందనల్లాంటి ట్వీట్లు కూడా పెట్టలేదు. అంటే జరుగుతున్నది చూస్తుంటే రత్నప్రభ పోటి విషయంలో పవన్ ప్రమేయం ఉందా లేదా అన్నది తేలలేదు. ఈ విషయాన్ని జనసేనలోని కీలకనేతలు కూడా ఎవరు ప్రస్తావించటంలేదు.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే రేపటి రోజున బీజేపీ అభ్యర్ధి నామినేషన్, ప్రచారంలో జనసేన ఎంతవరకు మనస్పూర్తిగా సహకరిస్తుందనేది అనుమానంగా మారింది. ఉపఎన్నిక అనివార్యం అని తేలిపోయిన దగ్గర నుండి తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయాలని జనసేన ఎంతగా పట్టుబట్టింది అందరికీ తెలిసిందే. పవన్ కూడా ఇదే విషయాన్ని అనేక వేదికల మీద ప్రస్తావించారు.

అయితే చివరి నిముషానికి వచ్చేసరికి ఎప్పట్లాగానే పవన్ ఆలోచనలను బీజేపీ తొక్కేసింది. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకానీ చివరకు పవన్ తోనే ఉపఎన్నికలో బీజేపీనే పోటీ చేస్తుందని చెప్పించారు. ఈ విషయంలోనే జనసైనికులు బాగా మండిపోతున్నారు.

తమను అడుగడుగునా బీజేపీ నేతలు అవమానిస్తున్నారని, కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని మండిపోతున్నారు. దీని ప్రభావం రేపటి ఎన్నికలపై కచ్చితంగా పడుతుంనటంలో సందేహంలేదు. మరి ఈ సమస్యనుండి కమలనాదులు ఎలా బయటపడతారో చూడాల్సిందే.