Begin typing your search above and press return to search.
బీజేపీ బాధేమిటో అర్ధం కావటంలేదే ?
By: Tupaki Desk | 2 April 2021 3:30 AM GMTతిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అగ్రనేతలు విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. అలాగే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు బాధేమిటో అర్ధం కావటంలేదు. వీర్రాజు మొదటినుండి ఒకటే పాట పాడుతున్నారు. అదేమిటంటే వైసీపీ, టీడీపీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని. ప్రత్యర్ధిపార్టీలు ఎన్నికల్లో పరస్పరం ఒకదాన్ని మరొకటి టార్గెట్ చేసుకోవటం మామూలే కదా. తిరుపతి ఉపఎన్నికలో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అధికార వైసీపీ నుండి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ నుండి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. రంగంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ చింతామోహన్, సీపీఎం అభ్యర్ధి కూడా ఉన్నప్పటికీ వాళ్ళనెవరు పట్టించుకోవటంలేదు. అందుకనే పోటీ ప్రధానంగా పై మూడు పార్టీల అభ్యర్ధుల మధ్యే ఉంటుందని అంచనా. అంటే ప్రతి పార్టీకి మిగిలిన రెండుపార్టీలు ప్రత్యర్ధులన్నట్లే లెక్క.
ఎన్నికల్లో ప్రత్యర్ధులపై ప్రతిపార్టీ కూడా ప్రచారంలో పై చేయిసాధించాలనే అనుకుంటుంది. అలాగే పటిష్టమైన ఎలక్షనీరింగ్ వ్యూహం ద్వారా విజయం సాధించాలని అనుకోవటంలోను తప్పులేదు. ఇందులో భాగంగానే వైసీపీ, టీడీపీలు బీజేపీని టార్గెట్ చేస్తుండచ్చు. ఇదే సమయంలో వైసీపీ, టీడీపీలు కూడా ఒకదాన్ని మరొకటి టార్గెట్ చేసుకుంటునే ఉన్న విషయం అందరు చూస్తున్నదే.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వీర్రాజుకు ఇదంతా తెలీదా ? తెలిసి కూడా పదే పదే గోల చేస్తున్నారంటేనే గ్రౌండ్ లెవల్లో కమలంపార్టీ పరిస్ధితేమిటో అర్ధమైపోతోంది. ఇక ఇన్చార్జి సునీల్ దేవధర్ అని మరో నేతున్నారు లేండి. ఆయనమో జగన్మోహన్ రెడ్డికి సేవ చేసిన గురుమూర్తిని ఎంపిగా ఎలా నిలబెడతారంటు విచిత్రమైన ప్రశ్న వేశారు. మూడు రోజుల క్రితం ఇదే వాదనను మొదటగా బీజేపీ ఎంపి జీవీఎల్ నరసింహారావు లేవదీశారు.
పోటీ చేయటానికి గురుమూర్తి అర్హుడా కాదా అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ కానీ ఆయన ఎవరికి సేవ చేస్తే వీళ్ళకేంటి ? పాదయాత్రలో జగన్ కు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి పనిచేస్తే ఎంపిగా పోటీ చేయటానికి అనర్హుడా ? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటేనే వీళ్ళలో సరుకులేదని అర్ధమైపోతోంది. గురుమూర్తి ఎంపిగా పనికొస్తాడా లేదా అన్న విషయాన్ని తేల్చాల్సింది జనాలే కానీ బీజేపీ నేతలు కాదని గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తారో.