Begin typing your search above and press return to search.

తిరుప‌తి మెజారిటీ ఎలా ఉంది? గ‌త రిజ‌ల్ట్ ఏం చెబుతోంది?

By:  Tupaki Desk   |   16 April 2021 3:30 AM GMT
తిరుప‌తి మెజారిటీ ఎలా ఉంది?  గ‌త రిజ‌ల్ట్ ఏం చెబుతోంది?
X
ఇటు అధికార పార్టీ గెలుపుపై ధీమాతో ఉంది. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కూడా అంతే ధీమా వ్య‌క్తం చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని లోపాలు.. దేవాల‌యాల‌పై జ‌రిగిన దాడులు.. ఎస్సీల‌పై జ‌రుగుతున్న హింసా కాండ .. వంటివి తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌భావం చూపుతాయ‌ని.. టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. దీనికి తోడు వైసీపీ నేత‌లు చెబుతున్న‌ట్టు సంక్షేమ పాల‌న కొంద‌రికే ప‌రిమిత‌మ‌వుతోంద‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌ని వారు.. లోపాలు గుర్తించిన వారు త‌మ‌కు జై కొడుతున్నార‌ని టీడీపీ అంచ‌నా వేసుకుంటోంది. ఇక‌, వైసీపీ గెలిచి తీరుతామ‌ని.. మెజారిటీనే మాకు ముఖ్య‌మ‌ని బ‌హిరంగంగానే చెబుతోంది.

ఈ నేప‌థ్యంలో.. తిరుప‌తి మెజారిటీ ఎలా ఉంది? ఏ పార్టీ ఇక్క‌డ స‌త్తా చూపుతుంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జ‌న‌సేన కూట‌మి, కాంగ్రెస్‌తోపాటు.. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ స‌హా మొత్తం 28 మంది ఇక్క‌డ పోటీ చేస్తున్నారు. వీరిలో స్వ‌తంత్రులు కూడా ఉన్నారు. అందులోనూ మ‌హిళ ‌లు కూడా క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓటు బ్యాంకు అనుకున్న విధంగా ఎవ‌రికీ ల‌భించే అవ‌కాశం లేద‌ని స్థానిక రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ప్ర‌ధాన పోటీ వైసీపీ, టీడీపీల‌మ‌ధ్యే ఉంటుంద‌ని.. అంచ‌నా వేస్తున్నారు. ఆది నుంచి బీజేపీ-జ‌న‌సేన కూట‌మి స‌త్తా చూపిస్తుంద‌ని అనుకున్నా.. ప్ర‌చార మేనేజ్ మెంట్‌లో పూర్తిగా నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు.

దీంతో బీజేపీ మాట ఎక్క‌డా వినిపించడం లేదు. ఇక‌, మిగిలింది టీడీపీ-వైసీపీలే. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం వైసీపీ నుంచి కొత్తగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన డాక్ట‌ర్ గురుమూర్తి రంగంలోకి దిగారు. ఈయ‌న తిరుప‌తికి చెందిన వ్య‌క్తే. ఇక‌, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉంది. కాంగ్రెస్ నేత‌ల నుంచి కూడా లోపాయికారీగా అండ‌దండ‌లు ఉన్నాయ‌నే అంటున్నారు. గురుమూర్తి త‌ర‌ఫున ప్ర‌భుత్వం మొత్తం అక్క‌డ మోహ‌రించింది. తిరుప‌తిలో ఇప్పుడు ఏ ప‌ని కావాల‌న్నా క్ష‌ణాల్లోనే పూర్తి అవుతోంది.

అదేస‌మ‌యంలో సంక్షేమ ప‌థ‌కాలు సైతం వెనువెంట‌నే అందుతున్నాయి. ఈ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌ర్వాత‌.. 150 మందికి కొత్త‌గా ఇళ్లు కేటాయించారు. 300 మందికి కొత్త‌గా పింఛ‌న్లు ఇచ్చారు. ఇంటింటికీ రేష‌న్ ఠంచునా అందిపోయింది. సో.. వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, టీడీపీ కూడా సీబీఎన్ ఆర్మీని రంగంలోకి దింపి.. ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించింది. చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర‌లు, రోడ్ షోలు, స‌భ‌లు నిర్వ‌హించారు. లోకేష్ త‌న వాగ్ధాటితో .. వైసీపీ నేత‌ల‌పైనా.. ప్ర‌భుత్వ పాల‌న‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అభ్య‌ర్థి.. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహ‌న్ సైతం.. ఇంటింటి ప్ర‌చారం చేశారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ట‌ఫ్ ఫైట్ ఖాయ‌మ‌ని.. గెలుపు మాత్రం వైసీపీ-టీడీపీల‌మ‌ధ్యే ఉన్నా.. మెజారిటీ గ‌త ఎన్నిక కంటే త‌గ్గుతుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌కు కేవ‌లం 2ల‌క్ష‌ల 28 వేల 376 ఓట్ల మెజారిటీ మాత్ర‌మే ల‌భించింది. ఇక‌, ఇప్పుడు ఎవ‌రు గెలిచినా.. ఈ మెజారిటీ కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.