Begin typing your search above and press return to search.
తిరుపతి బై పోల్ : పోలింగ్ ఏర్పాట్లు పూర్తి .. రేపే పోలింగ్ !
By: Tupaki Desk | 16 April 2021 6:21 AM GMTఎప్పుడా ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ కి సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం (ఏఫ్రిల్ 17న) పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు మే2న ఫలితాలు వెలువడనున్నాయి. తిరుపతి ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ గతేడాది సెప్టెంబరు 16న మరణించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, సీపీఎం అభ్యర్థి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతామోహన్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మొత్తం 34 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో నాలుగు నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో నామినేషన్ల సంఖ్య 30కి చేరింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు మరో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఫైనల్‌గా 28 మంది అభ్యర్ధులు నిలిచారు. రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఈ ఉప ఎన్నికలో 17,11,195 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందొ తెలుసుకోవడానికి "mayknowpollingstation" అనే ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఓటర్ ఐడి నెంబర్ ఇస్తే మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోవచ్చు.
ఇక ,పోలింగ్ విధులకు హాజరయ్యేవారిలో 99శాతంమందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించిన అధికారులు.. పోలింగ్ కేంద్రాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బూత్ కి వెయ్యిమంది ఓటర్లకి మించకుండా చర్యలు తీసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2వేల 470 పోలింగ్ బూత్ లు ఏర్పాటుచేశారు. గతంతో పోల్చుకుంటే 500 బూత్‌లు అదనంగా పెట్టారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 80ఏళ్ల పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ అందుబాటులోకి తెచ్చారు. గోప్యతను పాటిస్తూ మొబైల్ పోలింగ్ బూత్ ద్వారా ఓటేసే ఏర్పాట్లు చేశారు. ఇప్పటిదాకా దాదాపు 7వేల మంది వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక కోసం 23 కంపెనీల కేంద్ర బలగాలను దించారు. మూడు బెటాలియన్ల ఏపీఎస్పీ పోలీసులతో పాటు రెండు తెలంగాణ బెటాలియన్లను పోలింగ్‌కోసం మోహరించారు. తిరుపతి, నెల్లూరు డీజీపీ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. 55 క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని నియమించారు. ఓ వైపు మండుటెండలు.. మరోవైపు కరోనా తీవ్రత. ఈ సమయంలో జరుగుతున్న తిరుపతి బైపోల్ ని సవాలుగా తీసుకుంది అధికారయంత్రాంగం