Begin typing your search above and press return to search.

ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపట

By:  Tupaki Desk   |   27 April 2021 8:31 AM GMT
ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపట
X
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన డాక్టర్ చింతామోహన్ పెద్ద జోక్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీలు ఏకమయ్యాయట. ఈ రెండుపార్టీలు ఎందుకు కలిశాయంటే కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోవటానికేనట. ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని పై రెండుపార్టీలకు అర్ధమైపోయిందట. ఎలాగైనా కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకు వైసీపీ, బీజేపీలు ఏకమై ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు చెప్పారు.

ఉపఎన్నికలో 3.5 లక్షల దొంగఓట్లు పోలైనట్లు తాజాగా చింతా ఆరోపణలు చేశారు. ఒక్క తిరుపతిలో మాత్రమే 70 వేల దొంగఓట్లు పడినట్లు ఆయన లెక్క తేల్చేశారు. ఆయన లెక్కలకు ఆధారం ఏమిటయ్యా అంటే కాకిలెక్కలే. ఎందుకంటే తిరుపతిలో ఉన్న ఓట్లు సుమారు 2.5 లక్షలు. ఉపఎన్నికలో జరిగిన పోలింగే 50 శాతం. అంటే కారణాలు ఏవైనా కానీండి ఓటుహక్కును ఉపయోగించుకున్న వారు 1.25 లక్షలని తేలిపోయింది.

ఇపుడు చింతా చెబుతున్న లెక్క ప్రకారం దొంగఓట్లే 70 వేలు పడ్డాయట. అంటే ఓటుహక్కు ఉపయోగించుకున్న ఒరిజినల్ ఓటర్లు 50 వేలేనా ? చింతా చెప్పిన లెక్కలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. పైగా ప్రతి బూత్ లోను 400 దొంగఓట్లు పడ్డాయట. నిజంగానే వైసీపీ లక్షలాది దొంగఓట్లను వేయించుకోవటం నిజమే అయితే మరి మిగిలిన పార్టీల పోలింగ్ ఏజెంట్లంతా ఏమి చేస్తున్నట్లు.

గెలుపుపై నమ్మకం లేకపోయినా టీడీపీ దొంగఓట్ల రద్దాంతం చేస్తోందంటే అర్ధముంది. అసలు డిపాజిట్ వస్తుందో రాదో కూడా తెలీని బీజేపీ, కాంగ్రెస్ లు కూడా దొంగఓట్లు పడ్డాయని గోల చేస్తుండటమే విచిత్రంగా ఉంది. ఏ ఎన్నికలో అయినా దొంగఓట్లు అన్నది సాధరణమైపోయింది. ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు దొంగఓట్లు వేయించుకోవటం అందరికీ తెలిసిందే. ఉపఎన్నికను సక్రమంగా నిర్వహిస్తే కాంగ్రెస్ దే గెలుపని చింతా చెప్పటమే పెద్ద జోక్ గా మారింది.