Begin typing your search above and press return to search.

బెస్ట్ సిటీ: విజయవాడ బెస్ట్ - హైదరాబాద్ లాస్ట్

By:  Tupaki Desk   |   14 Aug 2018 7:40 AM GMT
బెస్ట్ సిటీ: విజయవాడ బెస్ట్ - హైదరాబాద్ లాస్ట్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా ప్రచారం చేస్తున్నారు. ఐటీ - పెట్టుబడులను ఆకర్షించేందుకు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చేందుకు నానా రకాల ప్లాన్లు వేస్తున్నారు. కానీ ఇంత చేస్తున్న ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన భారతదేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్ నగరం దిగజారిపోవడం తెలంగాణ ప్రభుత్వానికి ఒకరకమైన షాక్ కు గురిచేసే వార్తే..

తాజాగా కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి భారతదేశంలోని టాప్10 అత్యంత నివాసయోగ్యమైన నగరాల ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఏపీలో తిరుపతి - విజయవాడ నగరాలు టాప్ లిస్టులో ఉండడం విశేషం.. తెలంగాణలోని ఏ నగరం కూడా టాప్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం.

కేంద్ర ప్రకటించిన ర్యాంకుల్లో మహారాష్ట్రలోని ఫుణె నగరం నంబర్ 1 ర్యాంకు ను సొంతం చేసుకుంది. ఇక్కడ ఎక్కువమంది ఎలాంటి సమస్యలు లేకుండా మంచి జీవనప్రమాణాలతో జీవిస్తున్నారని.. ఇదే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తేల్చారు. ఆ తర్వాత రెండో ర్యాంకు నవీ ముంబై - మూడో ర్యాంకు గ్రేటర్ ముంబై - 4-తిరుపతి - 5-చండీఘడ్ - 6-థానె - 7-రాయిపూర్ - 8-ఇండోర్ - 9- విజయవాడ - 10వ ర్యాంకులో భోపాల్ నగరం ఉంది.

దేశంలోని మొత్తం 111 నగరాల్లో ఈ సర్వే జరగగా టాప్ 10లో తెలంగాణలోని ఏ నగరం చోటు దక్కించుకోలేదు. కేంద్రమంత్రి హరిదీప్ మాట్లాడుతూ ‘నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించామని.. ప్రభుత్వ పాలన - విద్య - వైద్యం - ఆర్థిక - మౌళిక సదుపాయాలను గమనించి ఈ ర్యాంకులు ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ జాబితాలో చెన్నై 14వ ర్యాంకులో నిలవగా దేశ రాజధాని ఢిల్లీ 65వ ర్యాంకులో నిలిచి దుర్భర నగరంగా మిగిలిపోయింది. ఇక ఎన్నో అంచనాలున్న హైదరాబాద్ 27వ ర్యాంకులో నిలవగా.. కరీంనగర్ 11వ స్థానంలో నిలవడం విశేషం.