Begin typing your search above and press return to search.
తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు!
By: Tupaki Desk | 25 March 2021 1:30 PM GMTతిరుపతి ఉప ఎన్నిక ఏపీలో హీట్ పెంచుతోంది. ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ బలంగా నిలబడుతున్న వేళ బీజేపీ-జనసేన వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ గెలుపు కోసం అహర్నిశలు పాటు పడుతోంది. ఇదే క్రమంలో కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తున్నాయి.
వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కుటుంబానికి కాకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతున్నాయి. గురుమూర్తిని ఖాయం చేశారు.. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఇప్పటికే ఖరారయ్యారు. ఇప్పుడు బీజేపీ కొత్త ఆప్షన్ ను ఎంచుకుంది.
తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కర్ణాటక కేడర్ మాజీ ఐఏఎస్ అయిన ఈమెను తిరుపతి పార్లమెంట్ ఎంపీ బరిలో బీజేపీ తరుఫున నిలపాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. కొద్దిసేపట్లోనే ఈమెను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
సహజంగానే బీజేపీలో మేధావులు, బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేస్తారు. ఈ క్రమంలోనే బీజేపీ ఈ కొత్త అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తిరుపతి లోక్ సభకు 23న నోటిఫికేషన్ రాగా.. 30వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 31న పరిశీలన జరుపుతారు. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహిస్తారు.